Kingdom 4 Days Collections: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్ డమ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. జూలై 31న గురువారం విడుదైలన ఈ సినిమా నిన్న ఆదివారంతో బాక్సాఫీస్ దగ్గర నాలుగు రోజులు పూర్తి చేసుకుంది.
Kingdom 4 Days Collections: ‘కింగ్ డమ్’ మూవీతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబడుతున్నాడు. తొలి రోజే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో రూ. 39 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది.ఆ తర్వాత రోజు కూడా మంచి వసూళ్లను రాబడుతూనే ఉంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా కుమ్మేస్తోంది. తమిళంలో ఏకంగా రూ. 3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘కింగ్ డమ్’ మూవీ.. మలయాళంలో ఏకంగా రూ. కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కేవలం తెలుగు వెర్షన్ లో రాబట్టి సంచలనం రేపింది.
కేరళలో తెలుగు సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ఇక ఈ సినిమా నాలుగో రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా రూ. 82 కోట్ల గ్రాస్ (రూ. 45 కోట్ల షేర్ )వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల షేర్ (రూ. 9.5 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నాలుగు రోజుల్లో మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ లో దాదాపు 80 శాతం రికవరీ సాధించింది. ఈ రోజు సోమవారం వర్కింగ్ డే నుంచి కింగ్ డమ్ కు అసలు బాక్సాఫీస్ పరీక్ష ఎదురు కానుంది. ఈ రోజు నుంచి మిగిలిన 20 శాతం బిజినెస్ ను రికవరీ చేయడానికి ఎలాంటి పాట్లు పడుతుందో చూడాలి.
‘కింగ్ డమ్’ లో గౌతమ్ తిన్ననూరి క్రియేట్ చేసిన న్యూ వరల్డ్ కు ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. ఈ చిత్రంలో బోట్ ఛేజింగ్ సీన్స్.. శ్రీలంక మిలటరీతో చేసిన ఫైటింగ్ సీన్స్ ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి. టోటల్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించి విజయ్ దేవరకొండకు హిట్ అందిస్తుందా.. అబౌ యావరేజ్ గా మిగులుతుందా అనేది చూడాలి.