Add Zee Business As A Preferred Source
App

Vijay Rashmika Engagement: విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా.. ఎవ్వరు ఊహించని విధంగా..!

Written ByVishnupriya
Published: Oct 04, 2025, 02:59 PM IST|Updated: Oct 04, 2025, 02:59 PM IST

Vijay Devarakonda Engagement Photos : విజయ్ దేవరకొండ, రష్మిక.. నిశ్చితార్థం జరిగిపోయింది అంటూ నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వస్తుందా సంగతి తెలిసిందే. నిజంగానే వీరిద్దరి నిన్న హైదరాబాదులో.. మీరు కుటుంబాల సమీక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నట్టు వినికిడి. ఈ క్రమంలో ఈ నిశ్చితార్థ వేదిక ఫోటోల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..

Rashmika Mandanna Engagement Photos1/5

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ఫోటోలు

విజయ దేవరకొండ, రష్మిక మందాన నిశ్చితార్థం జరిగిపోయింది అన్న వార్తలు మీడియాలో వచ్చిన దగ్గరనుంచి.. వీరిద్దరి అభిమానులే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులు కూడా.. ఈ నిశ్చితార్థం ఫోటోలు చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. 

Vijay Devarakonda Rashmika Engagement2/5

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ఫోటోలు

కానీ ఈ నిశ్చితార్థం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో.. అలానే వీరిద్దరూ కూడా నిశ్చితార్థం కి సంబంధించి ఎలాంటి ఫోటోలు ఇప్పటికీ షేర్ చేయకపోవడంతో.. ఇక వీరిద్దరి నిశ్చితార్థం ఫోటోలు బయటకి రావా అని ఆందోళన కూడా చెందుతున్నారు.

Rashmika Mandanna Vijay Devarakonda Engagement Photos 3/5

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ఫోటోలు

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, రష్మికా నిశ్చితార్థ ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ వైట్ డ్రెస్ వేసుకొని పూలమాలలు వేసుకొని ఉన్న ఫోటోలు.. షేర్ చేస్తూ చాలా మంది ఇది విజయ్ దేవరకొండ నిశ్చితార్థం ఫోటోలు అని క్యాప్షన్ పెడుతున్నారు.   

Vijay Devarakonda Marriage 4/5

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ఫోటోలు

ఇక కొంతమంది ఈ ఫోటోలన్నీ చూసి ఇది నిజంగానే వారి నిశ్చితార్థం ఫోటోలు అనుకొని.. వాటిని మళ్లీ రీసెర్ చేస్తున్నారు. కానీ అసలు విషయానికి వస్తే.. వీళ్ళిద్దరూ ఇప్పటివరకు ఫోటోలను అసలు విడుదల చేయలేదు. 

Rashmika Mandanna Engagement 5/5

విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ ఫోటోలు

సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు అన్నీ కూడా ఏ ఐ ద్వారా జనరేట్ చేసిన ఫోటోలు మాత్రమే.. ఇలా ఎవరు ఊహించని విధంగా.. ఏఐ ఫోటోలు వైరల్ అవుతూ ఉండటంతో.. మరోసారి విజయ, రష్మిక అభిమానులకు నిరాశ ఎదురయింది.