Vijay Rashmika Net Worth : టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం.. విజయ్ దేవరకొండ.. రష్మిక మందన్న నిశ్చితార్థం. ఈ ఇద్దరి పేర్లు చాలా కాలంగా ప్రేమ రూమర్స్‌లో వినిపిస్తున్నాయి. అక్టోబర్ 3, 2025న వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1/5సినీ వర్గాల సమాచారం ప్రకారం. విజయ్, రష్మిక నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హౌస్‌లో నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరయ్యారని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఫోటోలు లేదా అధికారిక ప్రకటన రాలేదు. అందుకే అభిమానులు ఇంకా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
2/5రష్మిక మందన్న ప్రస్తుతం పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగింది. ఆమెకు సుమారు రూ.65 కోట్లు నెట్‌వర్త్ ఉందని సమాచారం. ఒక్క సినిమాకు సుమారు రూ.4 కోట్లు, ‘పుష్ప 2’ కోసం దాదాపు రూ.10 కోట్లు తీసుకుంటోందట. అలాగే బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ కూడా ఉంది. ఫిల్మ్‌లతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా భారీ ఆదాయం పొందుతోంది.
3/5మరోవైపు విజయ్ దేవరకొండకు రూ.50–60 కోట్ల నెట్‌వర్త్ ఉందని అంచనా. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్‌లో రూ.15 కోట్ల విలువైన భవనం, వోల్వో, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్, ఫోర్డ్ ముస్తాంగ్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ‘రోడీ’ అనే తన బ్రాండ్ ద్వారా కూడా భారీ ఆదాయం వస్తోంది.
4/5దీంతో వీళ్లిద్దరి ఆస్తి కలిపితే.. ఏకంగా 120 నుంచి 130 కోట్ల వరకు ఆస్తి ఉండొచ్చు. వీరిద్దరి కెమిస్ట్రీ గీత గోవిందం సినిమా నుంచే అభిమానుల్లో ఆసక్తి రేపింది. అప్పటినుంచి వీరిద్దరూ ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూ రూమర్స్‌కు కారణమయ్యారు. ఇప్పుడు ఈ నిశ్చితార్థ వార్తలతో టాలీవుడ్ అంతా ఆసక్తిగా మారింది.
5/5విజయ్ తన కొత్త సినిమా VD14 కోసం సిద్ధమవుతుండగా.. రష్మిక త్వరలోనే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కనిపించనుంది.