Betting Apps Case: బెట్టింగ్ యాప్‌ ఆరోపణలు.. షాకింగ్ నిజాలు బైటపెట్టిన విజయ్ దేవర కొండ టీమ్..

Betting Apps Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహరం ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు పలువురు సెలబ్రీటీలపై కూడా కేసుల్ని నమోదు చేశారు. వీరిలో విజయ్ దేవర కొండ కూడా ఉన్నారు.
 

1 /6

బెట్టింగ్ యాప్ వ్యవహరం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే.. ఇప్పటి వరకు బెటింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారిలో.. పోలీసులు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్లు, బుల్లితెర నటీనటులపై కేసుల్ని నమోదు చేశారు. ఇప్పటికే వీరికి నోటీసులు సైతం జారీ చేశారు.  

2 /6

ఇక తాజాగా.. పోలీసులు గతంలో కూడా బెట్టింగ్ ప్రమోషన్లకు పాల్పడిన బడా సెలబ్రీటీలపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేశారు.ఈ క్రమంలో దాదాపు.. 24 మందిపై పోలీసులు కేసుల్ని నమోదు చేశారు. వీరిలో రాణా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవర కొండ, శ్యామల, మంచు లక్ష్మి,నిధి అగర్వాల్, ప్రణిత , అనన్య నాగళ్ల వంటి వారు ఉన్నారు.   

3 /6

ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ లప్రమోషన్స్ లు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై విజయ్ దేవర కొండ టీమ్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ లో నిజంలేదన్నారు.    

4 /6

స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని తెలిపింది.

5 /6

విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఆతర్వాత మాత్రమే విజయ్ దానికి ప్రచార కర్తగా ఉంటారన్నారు. ఏ 23  సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారన్నారు.

6 /6

మరోవైపు రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసిందన్నారు. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసిందని వెల్లడించారు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పీఆర్ టీమ్ స్పష్టం చేసింది.  ఇప్పటికే విష్ణుప్రియ, శ్రీముఖి , బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నానీ, టేస్టీ తేజా, రీతుచౌదరీ, సుప్రీత, అనలిస్టు సుధీర్ తదితరులు ఉన్నారు.