Vijay Rashmika Shocking Net worth: అంతా ఊహించినట్టే లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మికల ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంట్లోనే వారు నిశ్చితార్థం చేసుకున్నారు. నిన్నటి నుంచి ఈ వార్త ట్రెండింగ్ లో నిలిచింది. అయితే వీరిద్దరి వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. వీరి వివాహం ఓ ఫేమస్ డెస్టినేషన్ స్పాట్‌గా జరగనుందని సమాచారం. అయితే కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే రష్మిక విజయ్ దేవరకొండల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
1/7రష్మిక విజయ్ దేవరకొండలు నిశ్చితార్థం చేసుకున్నారు. నిన్నటి నుంచి వైరల్ గా మారింది. ఎన్నో రోజులుగా వారు కలిసి మీడియా కంట పడుతూనే ఉన్నారు. తాజాగా ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే రష్మిక విజయ్ దేవరకొండల ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం.
2/7నేషనల్ క్రష్ రష్మిక పుష్ప సినిమా నుంచి ఒక రేంజ్ లో చరిష్మా మారిపోయింది. హిందీలోనూ ఆమె నటించారు. కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ రష్మికలు డేటింగ్ చేస్తున్నట్లు మీడియా కథనాలు వచ్చాయి. అదే నిజమై తాజాగా వారు నిశ్చితార్థం చేసుకున్నారు
3/7గతంలో రష్మిక నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించి 2017 ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. వీరిద్దరూ కిరిక్ పార్టీలో కలిసి పని చేశారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వాళ్లు నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్నారు. అప్పట్లో ఆ వార్త తెగ వైరల్ అయింది.
4/7అయితే రష్మిక విజయ్ దేవరకొండలు నటనతో పాటు కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లకు కూడా ఉన్నారు. సొంత వ్యాపారాలు వివిధ పెట్టుబడులు పెట్టారు. వారి ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రష్మిక ఆస్తుల విలువ రూ.66 కోట్లు ఉండవచ్చు ఆమె ఒక్క సినిమాకి దాదాపు రూ.8 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.
5/7ఇక నేషనల్ క్రష్ కొన్ని బ్రాండ్లను ఎండార్స్ చేయడానికి దాదాపు కోటి వరకు ఛార్జ్ చేస్తుందంట. దీంతో పాటు ఆమె మరికొన్ని బ్రాండ్‌లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రష్మిక వీటితో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ రంగాలల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. ఆమెకు హైదరాబాద్ తో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లు కూడా ఉన్నాయి.
6/7ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే అర్జున్ రెడ్డి తో ఒక రేంజ్ తన క్రేజ్ మారిపోయింది. ఆయన నెట్‌వర్త్ కూడా తెలుసుకుందాం. ఒక సినిమాకు విజయ్ దాదాపు రూ.11 కోట్ల వరకు వసూలు చేస్తారంట. అయితే ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.70 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. బ్రాండ్ ఎండార్స్‌కు ఆయన కోటి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
7/7విజయ్‌కు కూడా సొంత వ్యాపారాలు ఉన్నాయి. ఆయన మింత్రా ఫ్యాషన్ బ్రాండ్‌తో కలిసి సొంత రౌడీ బ్రాండ్ ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు గుడ్ వైబ్ ఓన్లీ కేఫ్ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ప్రారంభించాడు. హైదరాబాద్ బ్లాక్ హాక్ అనే వాలీబాల్ జట్టుకు కూడా సహయజమని గా ఉన్నారు. ఇక వీరిద్దరి ఆస్తుల విలువ కలిపితే దాదాపు రూ.140 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. దీంతోపాటు వీరిద్దరి వద్ద లగ్జరీ కార్ కలెక్షన్ కూడా ఉంది.