Vijay Net Worth: తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలకు.. TVK పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ నష్టపరిహారం ప్రకటించాడు. సంఘటనలో చనిపోయిన వారికి రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు కేటాయించాడు. దీంతో ఇప్పుడు విజయ్ ఆస్తుల గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
1/7దక్షిణ భారత సినిమా సూపర్ స్టార్ మరియు తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్.. తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాట సంఘటన వల్ల వివాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ నిర్వహించిన ర్యాలీలో భారీ జన సమూహం కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా మరణించారు.
2/7ఇక ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు విజయ్.. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ ఆస్తుల గురించి నెట్టింట్లో చర్చలు జోరందుకున్నాయి.
3/7ఇండియా టైమ్స్ నివేదిక ప్రకారం విజయ్ ఆస్తులు సుమారు రూ. 600 కోట్లగా అంచనా. చెన్నైలోని నీలంకరాయ్‌లోని కాసువారినా డ్రైవ్‌లో.. విజయ్‌కి ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ బీచ్ హౌస్ లాగా ఈ ఇంటిని నిర్మించారు.
4/7బీస్ట్ మూవీకి విజయ్ 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. సినిమాలు, ప్రకటనల ద్వారా దళపతి విజయ్ వార్షిక ఆదాయం 100 నుంచి 120 కోట్ల మధ్య ఉంటుంది.
5/7విజయ్ దగ్గర 2.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, బిఎండబ్ల్యూ ఎక్స్5, ఎక్స్6, ఆడి ఏ8ఎల్, 65 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
6/7విజయ్ రాజకీయ ప్రస్థానం గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 2, 2024 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. 2009లో తన అభిమానులను ఏకం చేయడానికి.. విజయ్ మక్కల్ ఇయక్కం అనే అభిమాన సంఘాన్ని ప్రారంభించాడు.
7/72011 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంఘం ఏఐఏడీఎంకే కూటమికి మద్దతు ఇచ్చింది. 2021లో తమిళనాడు స్థానిక ఎన్నికల్లో 169 స్థానాల్లో పోటీ చేసి 115 స్థానాలు గెలిచి రాజకీయ బలాన్ని చాటుకుంది. ఈ బలం కొత్త పార్టీని నిర్మించడానికి ఆధారంగా నిలిచింది.