Add Zee Business As A Preferred Source
App

Danger Bells: జర జాగ్రత్త.. హైదరాబాద్‌ను వణికిస్తున్న వైరల్‌ ఫీవర్స్.. గ్రేటర్‌లో ఆసుపత్రులకు క్యూ కడుతున్న పేషెంట్లు

Written ByAruna Maharaju
Published: Sep 04, 2025, 04:16 PM IST|Updated: Sep 04, 2025, 04:17 PM IST

Be Alert: హైదరాబాద్‌ను వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రులకి జనాలు క్యూ కడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  

Viral Fever In Hyderabad1/5

హైదరాబాద్ లో వైరల్ ఫీవర్

గ్రేటర్‌ పరిధిలో విష జ్వరాలు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య బాగా పెరిగింది. ఒకరికి ఈ లక్షణాలు వస్తే, కుటుంబంలో మిగతా వారికి కూడా త్వరగా వ్యాపిస్తున్నాయి.   

Viral Fever  2/5

ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు

వాతావరణంలో వచ్చిన మార్పులే ఈ సీజనల్ వ్యాధులకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. చిన్న పిల్లలు మొదలు పెద్దవారి వరకు అందరూ జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒంటినొప్పులతో బాధపడుతున్నారు. 

Viral Fever In Hyderabad3/5

వైరల్ ఫీవర్

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రుల్లో రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణం కంటే 50 శాతం ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.   

Viral Fever 4/5

వైరల్ ఫీవర్

చల్లని వాతావరణం వల్ల ఫ్లూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్ జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ శ్రీహర్ష యాదవ్ తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలో కూడా చిన్న పిల్లల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే వర్షాకాలం, చలికాలంలో ఇలాంటి వ్యాధులు సహజమని.. ఈ సంవత్సరం రోగుల సంఖ్య గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

Viral Fever In Hyderabad5/5

ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు

లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి, రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరైన చికిత్సతో త్వరగా ఆరోగ్యం పొందవచ్చని వారు తెలిపారు.