Virat Kohli Centuries: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేశాడు. రాంచి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శతకం చేసిన కోహ్లీ.. రాయ్‌పుర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లోనూ మూడు అంకెల స్కోరు అందుకున్నాడు.
1/5భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతోంది. అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు.మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగుల ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2/5మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 90 బంతుల్లో కోహ్లీ సెంచరీ చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో కోహ్లీకి ఇది 53వ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ప్రస్తుతం కోహ్లీ పేరిటే ఉంది.
3/5ఇక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో భారీగా ఎగబాకాడు. రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో సాధించిన చారిత్రక సెంచరీ కారణంగా ఈ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ దూసుకెళ్లాడు.
4/5మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగుల ఇన్నింగ్స్ ఆడి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడురు. ఈ మ్యాచ్ అనంతరం విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం.. కోహ్లీ ప్రస్తుతం నాలుగవ స్థానానికి చేరుకున్నారు.
5/5దీంతో కోహ్లీ మళ్లీ వన్డే ఫార్మాట్‌లో బ్యాటింగ్‌లో తన గత టాప్ స్థానాన్ని దక్కించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. కేవలం 32 రేటింగ్ పాయింట్ల దూరంలోనే అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మకు గట్టి పోటీ ఇస్తున్నాడు.