Add Zee Business As A Preferred Source
App

Viral Kohli: నీ అభిమానం బంగారం కాను.. మొబైల్ కవర్ పై పసిడితో కోహ్లీ చిత్రం.. కింగ్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..!!

Written ByBhoomi
Published: Sep 23, 2025, 07:17 PM IST|Updated: Sep 23, 2025, 07:17 PM IST

Viral Kohli: క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కింగ్ కోహ్లీ గురించి అయితే చెప్పుకోవడానికి మాటలు సరిపోవు. కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. గత 17ఏళ్లుగా తన అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు. కోహ్లీ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయినా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. కోహ్లీ ని అభిమానులు ఎంతగా ఆదరిస్తారో ఈ స్టోరీ చదివితే అర్థమవుతుంది. 
 

Virat Kohli fan1/6

విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు

 భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే గుజరాత్‌కు చెందిన అంకిత్ పటేల్ అనే అభిమాని తన ప్రత్యేకమైన స్టైల్‌తో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కోహ్లీపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకునేందుకు అంకిత్ 15 తులాల బంగారంతో మొబైల్ కవర్ తయారు చేసి, అందులో కోహ్లీ ఫొటోను చెక్కించాడు. ఈ కవర్ విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని చెబుతున్నాడు.

Virat Kohli gold cover2/6

బ్రాస్‌లెట్‌పై కూడా కోహ్లీ పేరు

అంతే కాదు.. తన చేతికి వేసుకునే బ్రాస్‌లెట్‌పై కూడా కోహ్లీ పేరు రాసించుకున్నాడు. విరాట్ కోహ్లీ నాకు క్రికెట్‌లో గాడ్‌ఫాదర్ లాంటి వ్యక్తి. అతని ఆటతీరు, పట్టుదల, క్రీడాస్ఫూర్తి నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. నా క్రికెట్ కెరీర్‌లో పురోగతి సాధించడానికి కారణం కూడా కోహ్లీనే” అని అంకిత్ పటేల్ గర్వంగా చెప్పుకొచ్చాడు.

 Virat Kohli bracelet3/6

కోహ్లీని కలిసే రోజు కోసం

తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ అంకిత్, “నేను కోహ్లీని కలిసేందుకు మూడుసార్లు లండన్‌కి వెళ్ళాను. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు కలవలేకపోయాను. అయితే చాలా మంది భారత క్రికెటర్లను కలిశాను. కానీ కోహ్లీని కలిసే రోజు కోసం నేను ఇంకా ఎదురుచూస్తున్నాను” అని భావోద్వేగంగా చెప్పాడు.

Ankit Patel Kohli fan4/6

బంగారు కవర్

ఈ బంగారు కవర్ గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అంకిత్ మొబైల్‌లోని కవర్, బ్రాస్‌లెట్ చూసేందుకు స్థానికంగా చాలా మంది వస్తున్నారు. కోహ్లీ పట్ల తనకున్న అభిమానాన్ని అంకిత్ సోషల్ మీడియాలో కూడా పంచుకోవడంతో, ఈ ఫోటోలు అక్కడ వైరల్ అవుతున్నాయి.

Virat Kohli viral video5/6

అంకిత్ పటేల్

అంకిత్ పటేల్ తాను కూడా మంచి క్రికెటర్ అని, ఇప్పటికే అనేక మ్యాచ్‌లు ఆడానని చెప్పాడు. అతను విజయ్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. కానీ తన జీవితంలో పెద్ద మలుపు తిరిగిన కారణం కోహ్లీ అని స్పష్టంగా చెబుతున్నాడు.

Virat Kohli news6/6

బంగారు కవర్‌తో కోహ్లీ

అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి, బంగారు కవర్‌తో కోహ్లీపై అభిమానాన్ని చూపించిన అంకిత్ పటేల్ ఇప్పుడు క్రీడాభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారాడు.