Add Zee Business As A Preferred Source
App

Vivo T4 5G: సేల్‌కు ముందే Vivo T4 5Gపై ఊహించని ఆఫర్‌.. రూ.12 వేలకే, రూ.25 వేల మొబైల్‌..

Published: Sep 12, 2025, 03:21 PM IST|Updated: Sep 12, 2025, 03:21 PM IST

Vivo T4 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్‌కు ముందే వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిపై అద్భుతమైన బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.. 

Vivo T4 5G Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్ ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా అన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు అత్యంత చీఫ్ ధరలకే లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఛాన్స్ గా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా 30 నుంచి 40 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. 
 

Vivo T4 Pro Price1/8

ఫ్లిప్‌కార్ట్‌

బిగ్ బిలియన్ సేల్ ప్రారంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రిక్ పరికరాలపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ అయితే అత్యంత చీప్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.   

Vivo T4R 5G2/8

బిగ్ బిలియన్ సేల్

ముఖ్యంగా వివోకు సంబంధించిన మొబైల్స్ అత్యంత చీప్ ధరలకే లభిస్తున్నాయి. గతంలో వివో విడుదల చేసిన వివో T4 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్‌ బోనస్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

Vivo T4 5G 256Gb 8Gb Ram 3/8

వివో T4 5G

వివో T4 5G (Vivo T4 5G) స్మార్ట్‌ఫోన్ అత్యంత శక్తివంతమైన 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే క్వాడ్ కర్వ్డ్ డిజైన్‌తో వస్తుంది.

Vivo T4 5G Price In India4/8

ప్రైమరీ కెమెరా

ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది. ఈ మొబైల్ బ్యాక్‌లో స్పెషల్ 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా (OIS) + 2MP బోకె కెమెరాలు ఉంటాయి.  అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Vivo T4X5/8

ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఈ వివో T4 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 7300mAh పెద్ద బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.  ఇది IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది.  

 Vivo T4 5G Back Cover6/8

వివో T4 5G స్మార్ట్ ఫోన్‌

వివో T4 5G స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన వేరియన్స్ వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ భారత దేశంలో మొత్తం మూడు వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.25,999 నుంచి ప్రారంభమవుతుంది. బేస్ వేరియంట్ పై ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఆఫర్స్ నడుస్తున్నాయి.   

Vivo T4 Lite 5G7/8

బేస్ వేరియంట్ మొబైల్‌

ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో బేస్ వేరియంట్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 15 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పోనూ కేవలం రూ.21,999కే ఈ (Vivo T4 5G) మొబైల్ సొంతం చేసుకోవచ్చు.  

Vivo T4 Price8/8

రూ.2,000 వరకు డిస్కౌంట్

అలాగే మరింత తగ్గింపు పొందడానికి.. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి.. రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.  ఇక ఎక్స్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి బోనస్ పొందాలనుకునేవారు.. పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసి.. పేమెంట్ చేస్తే రూ.7,350 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.. ఇక ఈ ఆఫర్స్ అన్నీ పోను రూ.12,649కే ఈ (Vivo T4 5G) స్మార్ట్ ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు.