Marriage Dates in November and December: నవంబర్, డిసెంబర్ లలో కేవలం పెళ్లిళ్లకు కొన్ని మూహూర్తాలు మాత్రమే ఉండటంతో చాలా మంది రెడీ అయిపోయారు. దీంతో మార్కెట్ లోని దుకాణాలన్ని కస్టమర్లతో కళ కళలాడుతున్నాయి.
ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తొంది. గత కొన్ని నెలులుగా పెళ్లిళ్లకు బ్రేక్ లు పడ్డాయి. అయితే.. అనాదీగా దేవ్ ఉత్థనీ ఏకాదశి తర్వాత ద్వాదశిరోజున తులసీ వివాహంను హిందువులు దాదాపుగా అందరి ఇళ్లలో నిర్వహిస్తారు.
ఆ తర్వాత నుంచి చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒక రకంగా ద్వాదశి నుంచి మంచి మూహుర్తాలు ఉంటాయని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ రెండు నెలలు మాత్రమే ఈ ఏడాదికి ముగియడానికి మిగిలి ఉన్నాయి.
ఈ రెండు నెలల్లో ముఖ్యంగా.. నవంబర్ లో.. 8,12,13,16,17,18,21,22, 23, 25,26,27, 30 తేదీల్లో మంచి పెళ్లి మూహుర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ మాసంలో.. 1,3,4,5,6, 10,11, 13 శుభమూహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
దీంతో మరోసారి పెళ్లికి సంబంధించిన సందడి మొదలైంది. ఇప్పటికే పెళ్లి పనుల్లో చాలా మంది బీజి అయిపోయారు. క్యాటరింగ్, పురోహితులు, సన్నాయి, బ్యాండ్ వాళ్లు, డెకొరేషన్, కెమెరా , మొదలైన వారికి చేతి నిండా పని దొరుకుందని చెప్పుకొవచ్చు.
మరోవైపు కళ్యాణ మండపాల వారికి కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో మరల డిసెంబర్ 12 నుంచి ఫిబ్రవరి 1 వరకు శుభమూహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈ తేదీల్లో వివాహాలకు మరల బ్రేక్లు పడనున్నాయి.
దీనితో పాటు.. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం నేపథ్యంలో జన్వరి 14 వరకు నో మూహుర్తాలు ఉండవు. ఆ తర్వాత మరల ఫిబ్రవరి, మార్చినెలల్లోనే పెళ్లికి శుభమూహూర్తాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఈ పెళ్లి తేదీలు పంచాగాన్ని బట్టి కొద్ది పాటి తేడాలు కూడా ఉండవచ్చని పండితులు చెబుతున్నారు. ( ఇది వైరల్ కంటెంట్ ఆధారంగా రాయబడింది. జీ తెలుగు దీనికి బాధ్యత వహించదు.)