Onion-Lemon Benefits: మనిషి ఆరోగ్యానికి దోహదపడే ఎన్నో పోషకాలు ప్రకృతిలో విరివిగా లభిస్తుంటాయి. అందులో ముఖ్యమైనవి ఉల్లిపాయ, నిమ్మకాయలు. ఈ రెంటినీ కలిపి సలాడ్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం
లెమన్-ఆనియన్ ఎప్పుడు తినకూడదు మీరు ఏదైనా రోగంతో బాధపడుతున్నప్పుడు లేదా ఈ రెండూ కలిపి తింటే అనారోగ్య సమస్య ఉత్పన్నమైనప్పుడు వీటికి దూరంగా ఉండటం మంచిది. తినే ముందు వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.
వడదెబ్బ నుంచి రక్షణ వేసవిలో సాధారణంగా వడదెబ్బ భయం ఉంటుంది. అందుకే డైట్‌లో నిమ్మ, ఉల్లి కలిపి తీసుకుంటే వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది
ఐరన్ సంగ్రహణ నిమ్మాయలో విటమిన్ సి, ఉల్లిలో ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ సంగ్రహణం అద్భుతంగా జరుగుతుంది
ఇమ్యూనిటీ మీ ఇమ్యూనిటీ బలహీనంగా ఉండి తరచూ వ్యాధులకు గురవుతుంటే లెమన్-ఆనియన్ కలిపి తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది
జీర్ణక్రియ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఉల్లిపాయను లెమన్‌తో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఉల్లిలో విటమిన్లు, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం సహా చాలా పోషకాలుంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి