Add Zee Business As A Preferred Source
App

Pitru Dosh Symptoms: ఈ సంకేతాలు మీ ఇంట్లో కన్పిస్తున్నాయా..?.. పక్కాగా పితృ శాపం ఉన్నట్లే.!. ఏంచేయాలో తెలుసా..?

Written ByInamdar Paresh
Published: Sep 12, 2025, 08:31 PM IST|Updated: Sep 12, 2025, 08:37 PM IST

Pitru Paksham Effect: చాలా మంది తమ ఇళ్లలో ఎంత కష్డపడ్డ  జీవితంలో పురోగతి ఉండటంలేదని తెగ టెన్షన్ పడిపోతారు.అంతే కాకుండా.. మనస్సుకు అస్సలు ప్రశాంతత ఉండటం లేదని కూడా బాధపడుతుంటారు. ఇలాంటి వారు పితృ శాపంతో బాధపడుతున్నారని పండితులు చెబుతుంటారు. 
 

Pitru dosh remedies:1/6

పితృ పక్షం:

ప్రస్తుతం మనదేశంలో పితృ పక్షం నడుస్తొంది. ఈ సమయంలో చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని ప్రతీతి. వీరి ప్రీతీ కోసం వారి వారసులమైన మనం.. వాళ్లు చనిపోయిన తిథి రోజున లేదా అమావాస్యలోపు ఏ రోజులో అయిన మన పూర్వీకులకు ఇష్టమైన ఆహరం, వస్త్రంలు దానం చేస్తే దీని వల్ల మన పూర్వీకులు సంతోష  పడతారని పురాణాల్లో చెప్పబడి ఉంది.  

Pitra dosh:2/6

పితృ శాపాలు:

అంతే కాకుండా.. ఎవరైన ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజున తమ సంతానం.. వీరి పూర్వీకుల కోసం శ్రాధ్దకర్మాదికాలు చేయించకుండా ఉంటారో వారిని పూర్వీకులు శపిస్తారంటారు. అయితే.. అసలు పితృ శాపం ఎలా వస్తుందో చూద్దాం. కొంత మది ఇళ్లలో తమ పెద్దవాళ్లను అగౌరవ పరుస్తారు.  

sarva pitru amavasya:3/6

పితృ శాపం:

వారిని అస్సలు తిండి పెట్టకుండా, చిత్రహింసలకు గురిచేస్తారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న సంతానం.. గుక్కెడు ముద్దపెట్టేందుకు కూడా నరకం చూపిస్తారు. ఒకవేళ పెద్దలు పొరపాటున చనిపోతే.. అంతిమ సంస్కారాలు కూడా చేయరు. ఏటా చేయాల్సిన శ్రాద్దకర్మాదికాలుకూడా చేయరు.  ఇలాంటి పనుల వల్ల పితృ శాపం వస్తుంది.

Pitru paksham:4/6

పితృ పక్షం రెమిడీలు:

ఇంట్లో పితృ శాపం ఉందంటే.. వారి ఇంట్లో ఎప్పుడు చూసిన గొడవలు ఉంటాయి. ఎంత కష్టపడ్డ గుర్తింపు ఉండదు. అసలు పెళ్లిలో అన్నిరకాల అడ్డంకులు ఏర్పడతాయి. సంతానం విషయంలో కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అంతేకాకుండా.. ఉద్యోగ జీవితంలో సైతం పురోగతి ఉండదు. ఆర్థికంగా చాలా సతమతమౌతారు.  

Pitru dosh effect:5/6

సర్వ పితృ అమావాస్య:

వీళ్ల సంతానంకు కూడా సరైన ఉన్నతి ఉండదు. ఈ విధంగా కనుక మీ ఇంట్లో సింప్టమ్స్ కన్పిస్తే.. ఖచ్చితంగా వారి ఇంట్లో పితృ శాపం ఉన్నట్లు అని మనం అర్థం చేసుకొవాలి. వెంటనే మంచి పండితుడికి కలిసి పితృ శాపం నివారణకు పూజలు చేయించుకోవాలి.   

Pitru dosh:6/6

అమావాస్య:

ఇలాంటి ప్రభావం ఉన్న వారంతా తప్పనిసరిగా.. ఈ పితృ పక్షంలో శ్రాధ్ద కర్మాదికాలు చేయాలి. పండితులకు వారి పూర్వీకుల ప్రతీకొరకు దానధర్మాలు చేయాలి. అంతే కాకుండా.. నదీ ఒడ్డున పండితులతో శాంతి జరిపించుకోవాలి.ఈ విధంగా చేస్తే పితృ శాపం నుంచి విముక్తి లభిస్తుంది.