Nayanthara career: ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో..లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతోంది హీరోయిన్ నయనతార. దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేసిన నయనతార.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో మీకు తెలుసా..?
1/5సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్.. అనగానే నయనతార పేరు గుర్తొస్తుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టినా కానీ ఇంకా ఈమె జోరు తగ్గలేదు. ఇప్పటికీ సౌత్ ఇండియాలో నయనతార కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో నయనతారకు సంబంధించిన చిన్న విషయం కూడా తెగ వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
2/5నయనతారకు చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు ఆమె టెలివిజన్ యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలో.. నయనతార బంధువు ఒకరు ఉండడం వల్ల వారిద్వారా ఆమె నిర్మాతలకు, దర్శకులకు పరిచయమైంది.
3/5నయనతారకు మొదటి బ్రేక్ మనస్సినరే అనే మలయాళ సినిమాతో వచ్చింది. ఆమె అసలు పేరు అయిన డయానా కురియన్ ను ఆ సినిమా దర్శకుడు బాగా ఇష్టపడలేదు. దాంతో ఆమెకు "నయనతార" అనే పేరును పెట్టారు.
4/52005లో నయనతార తమిళ చిత్రమైన అయ్యా ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె సారథ్ కుమార్‌కు జంటగా నటించింది. ఈ సినిమా విజయం సాధించడంతో ఆమె తమిళ పరిశ్రమలో నిలదొక్కుకుంది. తర్వాత రజనీకాంత్ సరసన చంద్రముఖి చిత్రంలో నటించడం ఆమె కెరీర్‌కు మరింత బలాన్నిచ్చింది.
5/5తర్వాతి కాలంలో నయనతార అనేక తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి తన ప్రతిభను నిరూపించింది. 20 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూ, 40 ఏళ్ల వయసులో కూడా ఒక్కో సినిమాకు రూ.10-15 కోట్లు పారితోషికం పొందుతోంది.