Holi festival celebrations: హోలీని ప్రజలంతా ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. వివిధ రకాల రంగులను చల్లుకుంటూ ఎంతో ఉల్లాసంగా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు.
1/5హోలీ పండుగను ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్గా జరుపుకుంటారు. ముఖ్యంగా ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ సారి హోలీని మార్చి 14న తేదీన జరుపుకోబోతున్నాం.
2/5అదే విధంగా హోలీకి ఒక రోజు ముందు మార్చి 13 న కాముని దహానం వేడుకను జరుపుకుంటాం. కామ దహనం రోజున చాలా మంది ఇంట్లోని బట్టలు, దుస్తులను బైటపడేస్తుంటారు. హోలీని దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటు ఉంటాం. ఒక్కొ ప్రాంతంలో హోలీని ఒక్కొపేరుతో పిలుస్తాంటారు.
3/5హోలీ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో లాత్ మార్ హోలీగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల కొత్త అల్లుళ్లను హోలీ రోజు గాడిదల మీద ఊరేగించే సంప్రదాయం ఉంటుంది. ఈరోజున కుడకల బెల్లం దండను మెడలో వేసుకునే ఆచారంను కూా చాలా మంది పాటిస్తారు.
4/5హోలీని రంగవాలి హోలీగా, గులాల్ హోలీగా కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా హోలీ.. శ్రీకృష్ణుడు, రాధ ప్రేమను సూచిస్తుంది. ఈరోజున శ్రీకృష్ణుడు, రాధాదేవీలను భక్తితో పూజించాలని పండితులు చెబుతున్నారు. హోలీలో ఉపయోగించే రంగుల మాదిరిగా మన జీవితం కూడా రంగుల మయం కావాలని అందరు కోరుకుంటారు.
5/5రంగుల్ని కొంత మంది నేచురల్ రంగులను ఉపయోగిస్తే.. మరికొందరు ఇటీవల కెమికల్స్ తో కూడిన రంగుల్ని ఉపయోగిస్తున్నారు. బ్రజ్‌లో, హోలీని 40 రోజులు జరుపుకుంటారు. ఇక్కడ రంగులు మాత్రమే కాకుండా పువ్వులు, లడ్డులు కూడా ఒకరికి మరోకరు ఇచ్చుకుంటూ వేడుకలను జరుపుకుంటారు.