Anil Ambani: ముఖేష్ అంబానీ వెనక అనిల్ అంబానీ...తెరవెనక అసలు సిసలైన హీరో ఎవరో తెలుసా?

Thu, 12 Dec 2024-8:37 pm,

Anil Ambani: దివాలా అంచున ఉన్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మంచి రోజులు వచ్చాయి. అనిల్ అంబానీ కంపెనీ ఇప్పుడు మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. కంపెనీల షేర్లు మళ్లీ ఊపందుకోవడం ప్రారంభించాయి. రుణ విముక్తి పొందిన తరువాత, అనిల్ అంబానీకి చెందిన పవర్ కంపెనీ రిలయన్స్ పవర్ షేర్లు పడిపోయిన మార్కెట్‌లో కూడా అద్భుతాలు చేస్తున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ కంపెనీలకు ఇప్పుడు కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. కొత్త ఆర్డర్లు మాత్రమే కాదు, ఇప్పుడు అనిల్ అంబానీ శరవేగంగా కొత్త కంపెనీలను ప్రకటిస్తున్నారు. ఇదంతా ఎలా జరిగింది అనే ప్రశ్న ఖచ్చితంగా మనస్సులో అందరి మెదల్లో మెదులుతుంది.  అనిల్ అంబానీ మంచి రోజుల వెనకున్న మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం.   

అనిల్ అంబానీ సోదరుడు ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటి. రిలయన్స్ విభజన తర్వాత వారిద్దరికీ సమాన వాటాలు వచ్చాయి, కానీ ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని విస్తరించి బిలియనీర్ల జాబితాలో చేరాడు. అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోయి దివాళా తీశాయి. అయితే ఇప్పుడు అనిల్ అంబానీ తన సోదరుడి బాటలోనే నడిచాడు. ముకేశ్ అంబానీ కంపెనీల అప్పులను క్లియర్ చేయడంపై దృష్టి సారించారు. అనిల్ అంబాకీ కంపెనీలు లాభాల్లో ప్రయాణించడానికి కారణం అదే. ఇప్పుడు అనిల్ అంబానీ కూడా అప్పు తగ్గించుకోవడంపై దృష్టి పెంచారు. 

కంపెనీల రుణాలను తగ్గించడం లేదా తొలగించడంపై అనిల్ అంబానీ దృష్టి సారిస్తున్నారు. ఇటీవల అతని అనేక కంపెనీలు రుణ విముక్తి పొందాయి. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రోసా పవర్ సింగపూర్ రుణదాత వెర్డే పార్ట్‌నర్స్‌కు రూ. 850 కోట్ల రుణాన్ని ముందస్తుగా చెల్లించింది. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రోసా పవర్ వెర్డే పార్ట్‌నర్స్‌కు రూ.485 కోట్ల అదనపు రుణాన్ని చెల్లించడం ద్వారా జీరో డెట్ కంపెనీగా అవతరించిన గొప్ప విజయాన్ని సాధించింది. అంతకుముందు ఆయన కంపెనీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన రుణ భారాన్ని రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గించుకుంది. రిలయన్స్ పవర్, అనుబంధ సంస్థ సమల్కోట్ తన టర్మ్ లోన్‌పై బకాయి వడ్డీని కూడా చెల్లించింది. కంపెనీలపై అప్పుల భారం తగ్గడంతో వాటికి ఆర్డర్లు రావడం ప్రారంభించాయి.    

  కంపెనీల అప్పులు తగ్గిన వెంటనే కొత్త ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. రిలయన్స్ పవర్  అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఎన్‌యు సన్‌టెక్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి 930 మెగావాట్ల సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను అందుకుంది. గతంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ 500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీకి ఆర్డర్‌ను పొందింది.   

ఒకవైపు అనిల్ అంబానీ రుణం తీర్చుకుంటూనే మరోవైపు కొత్త కంపెనీలను ప్రారంభిస్తున్నాడు. రీసెంట్ గా రిలయన్స్ ఎన్ యూ ఎనర్జీస్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటైంది. ఈ కంపెనీ పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్,  బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రంగాలతో సహా సౌర, పవన శక్తిలో పని చేస్తుంది. దీనికి ముందు, అనిల్ అంబానీకి చెందిన ఇన్‌ఫ్రా కంపెనీ రిలయన్స్ జై ప్రాపర్టీస్ ప్రైవేట్ కంపెనీ పేరుతో కొత్త రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించింది. అనిల్ అంబానీ చైనా , అతిపెద్ద EV కంపెనీ BYD మాజీ భారత అధిపతిని EV రంగంలోకి ప్రవేశించడానికి సలహాదారుగా నియమించారు. రిలయన్స్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో కొత్త కంపెనీని ప్రారంభించాడు.  

అనిల్ అంబానీ వ్యాపారంలో రాణించడం వెనక ఆయన కుమారుల కష్టం కూడా ఉంది. అనిల్ అంబానీ ఇద్దరు కుమారులు జై అన్మోల్, అన్షుల్ అంబానీ వ్యాపారంలో రాణిస్తున్నారు. తన కుమారులిద్దరూ పూర్తి స్థాయి వ్యాపారంలోకి ప్రవేశించిన తర్వాత అనిల్ అంబానీకి చెందిన కష్టాల్లో కూరుకుపోయిన కంపెనీలు కాస్త లాభాల బాట పడుతున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link