Add Zee Business As A Preferred Source
App

Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

Written ByTA Kiran KumarUpdated byTA Kiran Kumar
Published: Mar 26, 2025, 07:32 AM IST|Updated: Mar 26, 2025, 07:35 AM IST

Jaya Prada Husband: నటి జయప్రద గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు నుంచి దక్షిణాదిలో అన్ని ఇండస్ట్రీస్ తో పాటు అప్పట్లో బాలీవుడ్ ను ఏలిని రియల్ ప్యాన్ ఇండియా హీరోయిన్ జయప్రద. వృత్తి గత జీవితంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన జయప్రద.. రియల్ లైఫ్ లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పాలి. ఇంతకీ ఈమె పెళ్లై ముగ్గరు పిల్లలున్న శ్రీకాంత్ నహతాను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనే విషయానికొస్తే..

Jaya Prada Husband Srikanth Nahata1/5

Jaya Prada Husband Srikanth Nahata: నటి జయప్రద 14 ఏళ్ల చిన్న వయసులోనే హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. అంతేకాదు అప్పట్లో తెలుగు దేశం  పార్టీ తరుపున రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. అటు ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరుపున రాంపూర్ ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ఇక ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు జరుపుకుంది.

Jaya Prada Zindagi 2/5

జయప్రద జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్  విషయాలు ఉన్నాయి.అప్పట్లోనే తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో పాపులర్ అయిన నటి జయప్రద. అప్పట్లోనే బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా వార్తల్లో నిలిచింది. ఇక హిందీలో అమితాబ్, ధర్మేంద్ర, జితేంద్ర వంటి అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అప్పట్లో తన సంపాదన విషయంలో ఆదాయపు పన్ను విషయంలో కొన్ని ఇబ్బందులను ఫేస్ చేసింది. 

Jaya prada producer srikanth Nahata 3/5

అదే సమయంలో .. జయప్రద.. నిర్మాత శ్రీకాంత్ నహతాతో పరిచయం ఏర్పడింది. అప్పటికీ ఆయన నిర్మించిన పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. అలా సినిమాల్లో పరిచయం కాస్త ప్రేమగా మారింది.

Jaya prada - Srikanth Nahata Marriage 4/5

కానీ అప్పటికే శ్రీకాంత్ నహతాకు పెళ్లి ముగ్గురు పిల్లలున్నారు.  అతను తన ఫస్ట్ వైఫ్ కు విడాకులు ఇవ్వకుండానే.. జయప్రద, శ్రీకాంత్ నహతా.. 1986 జూన్ 22న మ్యారేజ్ చేసుకున్నారు. అయితే.. అప్పటికే ఆయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్టు  వార్తల నేపథ్యంలో  శ్రీకాంత్ నహతాకు తనను మోసం చేసినట్టు జయప్రద తన సన్నిహితుల వద్ద బాధపడేదట.

Jaya Prada Husband 5/5

జయప్రద,  శ్రీకాంత్ నహత పెళ్లి చేసుకున్న తర్వాత.. చిత్ర పరిశ్రమలో పలు ఇబ్బందులను ఫేస్ చేసుకుంది. రెండో భార్యగా   ప్రజల నుంచి చీత్కారాలను  అందుకున్నట్టు పలు సందర్భాల్లో ప్రస్తావించింది.   అవేమి పట్టించుకోకుండా.. జయప్రద రాజకీయంగా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జయప్రద.. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచింది. ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు.