Dharmendra First Wife: ధర్మేంద్ర మొదటి భార్య ఎవరు..? విడాకులు ఇవ్వకుండానే ఎందుకు రెండో వివాహాం చేసుకున్నాడు..

Dharmendra First Wife: ధర్మేంద్రను అభిమానించే ప్రేక్షకులకు ఆయన భార్య అంటే హేమా మాలిని పేరే0 చెబుతారు. అయితే హేమా మాలిని కంటే ఎన్నో ఏళ్ల ముందే ప్రకాష్ కౌర్ ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ కౌర్ తో 1954లో వివాహాం అయింది. 1954లో వివాహం చేసుకున్న ధర్మేంద్ర మొదటి భార్య ఎవరనేది చాలా మందికి తెలియదు. ఇక  వారికి ఎంత మంది పిల్లలు ఉన్నారనే విషయానికొస్తే..

1 /6

Dharmendra First Wife: బాలీవుడ్ "హీ-మ్యాన్" ధర్మేంద్ర తన సినిమాలు, వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న విషయాలతో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.  హేమా మాలిని ఎఫైర్.. ఆపై ప్రేమ పెళ్లి .. ఇక మొదటి భార్య ప్రకాష్ కౌర్ కు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం వంటివి అంశాలు ఆయన్ని కాంట్రవర్షల్ పర్సన్ గా మార్చాయి. 

2 /6

ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్.. ఇపుడు పెద్ద సినిమా ఫంక్షన్స్ కు వచ్చింది లేదు. కానీ డియోల్ కుటుంబంలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనది.ధర్మేంద్ర మొదటి భార్య పేరు ప్రకాష్ కౌర్. ఆమె ఎల్లప్పుడూ మీడియా, వార్తలకు దూరంగా భర్త, పిల్లలే లోకండా బతుకుతుంది. తన వ్యక్తిగత జీవితంలో మీడియా రంగ ప్రవేశం చేయడాన్ని ఆమె ఎపుడు ఇష్టపడలేదు.

3 /6

1954లో చాలా చిన్న వయసులోనే ప్రకాష్ కౌర్ ను  ధర్మేంద్ర వివాహం చేసుకున్నాడు. అప్పటికి అతనికి వయసు 19 సంవత్సరాలు.  ఇంకా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు.

4 /6

ఇక ధర్మేంద్ర,  ప్రకాష్ కౌర్ లకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు సన్ని డియోల్ (అజయ్ సింగ్ డియోల్), బాబీ డియోల్ (విజయ్ సింగ్ డియోల్). సన్ని డియోల్.. తండ్రిని మించిన తనయుడిగా.. బాలీవుడ్ అగ్ర హీరోగా రాణించారు. దర్శకుడిగా సత్తా చాటారు. బాబీ డియోల్ కూడా బాలీవుడ్ హీరోగా ప్రతినాయకుడిగా సత్తా చాటుతున్నాడు. అంతేకాదు ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్ దంపతులకు  ఇద్దరు కుమార్తెలు విజేత డియోల్,  అజితా డియోల్ ఉన్నారు.

5 /6

ధర్మేంద్ర 1980లో నటి హేమా మాలినిని రెండో పెళ్లి చేసుకున్నాడు.  కానీ ధర్మేంద్ర తన మొదటి భార్య ప్రకాష్ కౌర్‌ను విడాకులు ఇవ్వలేదు.  రెండవ వివాహం తర్వాత కూడా, ప్రకాష్ కౌర్ ఎల్లప్పుడూ ధర్మేంద్రతో మంచి సంబంధాన్ని కొనసాగించాడు. అంతేకాదు రెండవ భార్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో.. మొదటి భార్యకు అంతే ప్రాధాన్యత ఇవ్వడం ధర్మేంద్ ప్రత్యేకత. ఈ రకంగా పెద్దిల్లు, చిన్నిళ్లు రెండింటిని హ్యాండిల్ చేసారు ధర్మేంద్ర. 

6 /6

ప్రకాష్ కౌర్ .. ధర్మేంద్ర రెండో పెళ్లి చేసుకోవడంతో కృంగిపోలేదు. బలంగా నిలబడింది.  ధర్మేంద్ర హేమా మాలినిని వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె ఎప్పుడూ బహిరంగంగా వారిపై తన ద్వేషాన్ని అక్కసును వెల్లగక్కలేదు. తన పిల్లలను పెంచడంపై మాత్రమే దృష్టి పెట్టింది. వారందరని ఉన్నతంగా తీర్చి దిద్దడంలో ఆమె పాత్ర మరవలేనిదనే చెప్పాలి.