Bank Holiday: రేపు అన్నీ బ్యాంకులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?

Friday Bank Holiday: రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు రానుంది, మే 9వ తేదీ అన్ని బ్యాంకులకు ఎందుకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆ రోజు ప్రత్యేకత ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

రేపు శుక్రవారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఈ సెలవు వర్తిస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  

2 /6

శుక్రవారం 9 మే పశ్చిమ బెంగాల్ లోని అన్ని బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ప్రధానంగా కలకత్తాలో రబీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ బ్యాంకులకు బంద్ ఉండనుంది. ఆయన రచయిత నోబెల్ ప్రైజ్ విన్నర్ ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.  

3 /6

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు ఇతర సంస్థలు కూడా సెలవు ప్రకటించారు, ఇంకా మే 12వ తేదీ బుద్ధ పూర్ణమి సందర్భంగా అగర్తల, ఐజ్వల్, బేలాపూర్, భోపాల్, ఈటా నగర్, జమ్ము, కోల్‌కత్తా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, సిమ్లా, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంది.  

4 /6

ఇక మే 16 శుక్రవారం రోజు స్టేట్ డే సందర్భంగా గ్యాంగ్‌టాక్‌లో బ్యాంకు బంద్ ఉంటాయి. మే 26వ తేదీ ఖాజీ నజరుల్ ఇస్లాం జయంతి సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు బంద్‌. ఇక మే 29వ తేదీ మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు బంద్ ఉండనుంది.  

5 /6

ఇక ఈ ప్రత్యేక దినాల్లో మాత్రమే కాకుండా 4, 11, 18, 25 ఆదివారాలు రానున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇక రెండో శనివారం 10, నాలుగో శనివారం 24వ తేదీల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి.  

6 /6

అయితే బ్యాంకులు బంద్ ఉన్నా కానీ ఆన్‌లైన్ సేవలు, యూపీఐ పేమెంట్స్ యథావిధిగా కోనసాగుతాయి. ఇవి మాత్రమే కాదు ఏటీఎం సర్వీస్ లు కూడా అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా సర్వీసులు నిర్వహించవచ్చు.