Jewellery Pink Paper: బంగారం లేదా వెండి నగలు కొన్నప్పుడు జ్యువెల్లరీ షాప్ వాళ్లు వాటిని గులాబీ రంగు కాగితలో చుట్టి ప్యాక్ చేస్తారు. మీరు ఇది గమనించే ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఈ గులాబీ రంగు కాగితాన్నే ఎందుకు ఎంచుకుంటారనేది ఎప్పుడైనా ఆలోచించారా?
బంగారం అంటే ప్రతి భారతీయుడికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, అక్షయ తృతీయ, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో బంగారు ఆభరణాలు కొనడం సంప్రదాయంగా మారింది. అయితే మీరు గమనించే ఉంటారు.. ఏ జువెలరీ షాపుకెళ్లినా, ఆభరణాలు పింక్ కలర్ కాగితంలో చుట్టి ఇస్తారు. చిన్న దుకాణం అయినా, పెద్ద షోరూమ్ అయినా ఈ పద్ధతి ఒకేలా ఉంటుంది. కానీ ప్రశ్న ఏంటంటే… బంగారం పింక్ కాగితంలోనే ఎందుకు చుడతారు? దీని వెనుక ఆసక్తికరమైన కారణాలున్నాయి
మొదటగా చెప్పుకోవాల్సింది సంప్రదాయం. శతాబ్దాల కిందటి నుంచే జువెలర్లు ఆభరణాలను గులాబీ రంగు కాగితంలోనే చుట్టేవారు. మన సంస్కృతిలో ఎరుపు, గులాబీ రంగులు శుభప్రదంగా, శ్రేయస్కరంగా భావిస్తారు. అందువల్ల ఆభరణాల వ్యాపారులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. బంగారు ఆభరణాలను శుభకార్యాలకు కొనుగోలు చేస్తారు కాబట్టి, గులాబీ రంగు కాగితం వాటికి శుభం కలిగించే సంకేతంగా భావిస్తారు.
అంతేకాదు, పింక్ కలర్ కాగితం ఆభరణాల అందాన్ని మరింత హైలైట్ చేస్తుంది. సాధారణ తెల్ల కాగితంపై బంగారం కొంచెం నిస్తేజంగా కనిపిస్తుంది. నలుపు లేదా నీలం పేపర్‌పై కూడా బంగారం అంతగా మెరవదు.
4/9కానీ పింక్ షేడ్‌లో చుట్టినప్పుడు నగల మెరుపు రెట్టింపు అవుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం పింక్ పేపర్‌లో కొంత మెటాలిక్ షీన్ ఉంటుంది. అది బంగారం వెలుగును ప్రతిబింబించి మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది.
5/9ఇంకా ఒక శాస్త్రీయ కారణం ఉంది. పేపర్‌లో ఉండే కొన్ని రంగులు లోహంపై ప్రభావం చూపించి బంగారం మెరుపును తగ్గిస్తాయి. ఉదాహరణకు ఎరుపు లేదా నీలం పేపర్‌లో ఉండే రసాయనాలు లోహంపై పడి కాస్తా మసకబారేలా చేయవచ్చు.
6/9కానీ పింక్ పేపర్‌లో అలాంటి దుష్ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాగే, ఇది గాలి, తేమ, ధూళి నుంచి ఆభరణాలను కాపాడుతుంది. దీని వల్ల బంగారం ఎక్కువకాలం తన మెరుపును నిలుపుకుంటుంది.
7/9ఇంకో కారణం ఆకర్షణ అని చెప్పవచ్చు. గులాబీ రంగు ఎప్పుడూ కళ్లకు హాయిగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గిఫ్ట్ ప్యాకింగ్‌లో కూడా పింక్ కలర్ వాడితే అందంగా, ప్రత్యేకంగా అనిపిస్తుంది.
అదే విధంగా ఆభరణాలను పింక్ కాగితంలో చుట్టి ఇస్తే కస్టమర్‌కి ఆ నగలు మరింత మెరుస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఈ విధంగా కేవలం సంప్రదాయం మాత్రమే కాకుండా, శాస్త్రీయ కారణాలు కూడా ఈ ఆచారానికి తోడయ్యాయి.
కాబట్టి ఇకపై మీరు బంగారం కొనుగోలు చేసినప్పుడు, పింక్ పేపర్‌లో ఆభరణాలు ఎందుకు చుడతారో మీకు అర్థమవుతుంది. ఇది కేవలం సంప్రదాయం కాదని, శాస్త్రీయంగా కూడా బంగారం మెరుపు, భద్రత కోసం ఈ పద్ధతి అనుసరిస్తున్నారని చెప్పుకోవచ్చు.