Kamal Haasan First Wife: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

Kamal Haasan First Wife: యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ గొప్ప నటుడు అన్న సంగతి తెలిసిందే కదా. సినీ లైఫ్ లో ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్న కమల్ హాసన్.. పర్సనల్ లైఫ్ మొత్తం కాంట్రవర్సీలకు నిలయం. ఇద్దరితో పెళ్లి.. ఒకరితో సహ జీవనం.. ప్రస్తుతం సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక కమల్ హాసన్ మొదటి భార్య వాణి గణపతికి ఎందుకు విడాకులు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎంత భరణం చెల్లించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

1 /6

Kamal Haasan First Wife: కమల్ హాసన్ తను ఎదుగుతున్న క్రమంలో వాణి గణపతిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సనాతన  బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కమల్.. ఓ పాత ఇంటర్వ్యూలో తన రెండు పెళ్లిళ్లు .. విడాకుల గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

2 /6

కమల్ హాసన్  1978లో ప్రముఖ నృత్యకారిణి వాణి గణపతిని  వివాహం చేసుకున్నాడు. కానీ 10 యేళ్ల వివాహా బంధం తర్వాత వీళ్లిద్దరి మధ్య  ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా 1988లో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు.వాణి గణపతి నుండి విడాకులు తీసుకున్న కొన్నేళ్ల తర్వాత 2015 లో ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తన మాజీ భార్య కు ఇచ్చిన భరణం కారణంగా తాను పూర్తిగా దివాళా తీసినట్లు చెప్పుకొచ్చారు.

3 /6

కమల్ హాసన్ తన మొదటి భార్యకు తన ఆస్తిలో మెజారిటీ వాటా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వాణి గణపతికి కొన్ని కోట్లు ముట్టినట్టు అప్పట్లో కొన్ని పత్రికలు రాసాయి కూడా.

4 /6

అయితే.. వాణి గణపతి మాత్రం.. అప్పట్లో తామిద్దరం కలిసి ఉన్నపుడు నేను వాడిన వస్తువులు కూడా కమల్ హాసన్ ఇవ్వలేదని బాంబ్ పేల్చింది. ఆయనతో పొసగకే మేమిద్దరం విడిపోయినట్టు వాణి గణపతి చెప్పుకొచ్చారు.

5 /6

వాణి గణపతితో విడాకుల తర్వాత కొన్నాళ్లు సారికతో డేటింగ్ చేశాడు. ఈ సందర్భంగా వీరికి శృతి హాసన్ పుట్టింది. ఆమె పుట్టిన తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి అక్షర హాసన్ పుట్టింది. ఇక కమల్ హాసన్, సారికలు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు.

6 /6

సారికతో విడాకల తర్వాత గౌతమితో సహ జీవనం చేసారు కమల్ హాసన్. ఆ బంధం కూడా ఎన్నాళ్లో నిలబడలేదు. ప్రస్తుతం కమల్ హాసన్ సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు.