Wine Shops Close: మందు బాబులకు మత్తు దిగే వార్త.. నేటి సాయంత్రం నుంచి 2 రోజులు వైన్ షాపులు బంద్..

Wine Shops Close: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకుగాను  తొలిదశ పోలింగ్‌ కు నేటి సాయంత్రంతో  ప్రచారం ముగుస్తోంది. దీంతో పంచాయితీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి సాయంత్రం నుంచి నాలుగు రోజులు పాటు వైన్ షాపులు క్లోజ్ చేయాలయని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

1 /5

తెలంగాణ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారుతుంది. అధికార పక్షంతో పాటు ప్రతి పక్షాలు ఓటర్లను ఆకట్టుకోవడానికి మద్యాన్ని ఎరగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులకు పోలింగ్‌ జరుగుతుంది. 

2 /5

తొలివిడత  ఎన్నికకు  ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. సాధారణ ఎన్నికల మాదిరిగానే  గ్రామ పంచాయితీల్లో  సైతం మద్యం, నగదును పంపిణీ  జోరుగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.   

3 /5

ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి వైన్ షాపులు బంద్ కానున్నాయి.  ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 

4 /5

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్‌ బంద్‌ చేయాలని, బార్లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

5 /5

గ్రామ పంచాయితీల తొలి విడత ఎన్నికల నేపథ్యంలో  ఈ రోజు  సాయంత్రం 5 గంటల నుండి ఈ నెల 11 వ తేదీ వరకు  ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈనెల 11న తొలి విడతలో 4వేల 236 స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.