Add Zee Business As A Preferred Source
App

Diabetes Control: HBA1Cని 9 నుంచి 6 కి తగ్గించుకున్న మహిళ.. 95 రోజుల్లో షుగర్ నామరూపాలు ఖతం చేసేలా..!

Written ByVishnupriya
Published: Sep 11, 2025, 06:09 PM IST|Updated: Sep 11, 2025, 06:32 PM IST

Health News
మధుమేహం అనే సమస్య.. నేటి కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. క్రమం తప్పకుండా మందులు వాడినా, డైట్ పాటించినా కొందరికి షుగర్ స్థాయి తగ్గడం కష్టమవుతుంది. అయితే కేవలం 45 రోజుల్లో HBA1C స్థాయిని 9 నుంచి 6కి తగ్గించుకున్న ఓ మహిళ అనుభవం ఇప్పుడు అందరికి ప్రేరణగా మారింది.

HBA1C Reduction1/6

సహజంగా షుగర్ తగ్గించడం,

ఆరు నెలలకు ఒకసారి తీసే.. HBA1C.. 9 దాటితే ప్రమాదమే. అలానే ఆరు దాటకుండా ఉంటే మాత్రమే డయాబెటిక్ కంట్రోల్ లో ఉన్నట్టు. ఇక ఒక మహిళ తొమ్మిది నుంచి ఆరుకి తగ్గించి అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. ఇక ఇది ఎలా సాధ్యం అనేది ఆమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మొదట్లో డాక్టర్ చెప్పిన మందులతో పాటు చిన్న చిన్న జీవనశైలిలో మార్పులు చేసింది. ముఖ్యంగా ఆహారంలో చక్కెర, బియ్యం తగ్గించింది. తెల్ల బియ్యం బదులు రాగి.. జొన్నలు, బార్లీ వంటివి తీసుకుంది. దీని వలన షుగర్ స్థాయులు నియంత్రణలోకి వచ్చాయి.

Diabetes Diet2/6

షుగర్ ఇంటి చిట్కాలు,

ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పదార్థాలను మాత్రమే తీసుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు చిన్న చిన్న భోజనాలుగా తినడం అలవాటు చేసుకుంది. రాత్రిపూట ఎక్కువ ఆహారం తినకుండా, తేలికపాటి సూప్ లేదా సలాడ్ మాత్రమే తీసుకుంది.  

Exercise Routine3/6

మధుమేహం ఆహారం,

ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు నడవడం, యోగా చేయడం మొదలుపెట్టింది. దీని వలన శరీరంలో ఇన్సులిన్ ప్రభావం మెరుగుపడింది. బరువు కూడా కొద్దిగా తగ్గడంతో పాటు రక్తప్రసరణ సరిగా జరిగి షుగర్ స్థాయి తగ్గింది.

Natural Remedies4/6

షుగర్ స్థాయి తగ్గడం,

తరచూ మెంతులు నీటిలో నానబెట్టి తాగడం, దాల్చిన చెక్క పొడి వాడటం, ఆమ్లా జ్యూస్ తీసుకోవడం లాంటివి కూడా చేసింది. ఇవన్నీ సహజంగా షుగర్ తగ్గించడంలో సహాయపడ్డాయి.

Success Story5/6

మధుమేహం నియంత్రణ,

ఈ విధంగా క్రమం తప్పకుండా ఆహారం, వ్యాయామం, సహజ చిట్కాలను పాటించడంతో కేవలం 45 రోజుల్లో ఆమె హెచ్బిఎ1సి 9 నుంచి 6కి తగ్గింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా జీవిస్తూ..ఇతరులకు కూడా ఇదే పద్ధతి పాటించాలని సూచిస్తోంది.

Diabetes Tips6/6

హెచ్బిఎ1సి తగ్గింపు,

మొత్తానికి మందులతో పాటు సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, సహజ చిట్కాలు వాడితే మధుమేహం నియంత్రణలో ఉంచవచ్చు. ఈ మహిళ అనుభవం అందరికీ పూర్తిగా నిలుస్తుంది అని చెప్పదంలో సందేహం లేదు.