World largest Rivers: ప్రపంచంలోని అతిపెద్ద టాప్ 5 నదులివే
యంగ్త్ జే
యంగ్త్ జే నది చైనాలోని అతి పొడవైన నది. ఇదే దేశంలో ప్రవహిస్తుంది. తూర్పు చైనా సముద్రంలో కలిసే ఈ నది సెకనుకు 37,740 క్యూబిక్ మీటర్ల నీటిని డిశ్చార్జ్ చేస్తుంది.
ఓరినోకో
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా, కొలంహబియాలో ప్రవహించే ఓరినికో నది పొడవు దాదాపుగా 2,250 కిలోమీటర్లు. ఈ నది అట్లాంటిక్ మహాసముద్రంలో సెకనుకు 37,740 క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తుంది.
కాంగో
ఆఫ్రికాలోని కాంగో నదికి మరో పేరు జాయ్ రే. సెకనుకు 41,400 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్రంలో విడుదల చేస్తుంది. ఈ నది అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది.
గంగా బ్రహ్మపుత్ర మేఘన
ఇండియా, టిబెట్, బంగ్లాదేశ్‌లో ప్రవహించే గంగా, బ్రహ్మపుత్ర, మేఘనలు కలిసి ఓ పెద్ద ప్రవాహంగా మారతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఇదే. ఈ నదులు బంగాళాఖాతంలో సెకనుకు 43.950 క్యూబిక్ మీటర్ల నీటిని వదులుతాయి.
అమెజాన్
దక్షిణ అమెరికాలో ప్రవహించే అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద నదిగా చెబుతారు. ఈ నది సెకనుకు 224 వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తుంటుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ప్రవహిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.