White Rice Countries: వైట్ రైస్ ఎక్కువగా తినేది ఎక్కడ, ఆ దేశంలో రోజుకు ఎంత తినేస్తున్నారో తెలుసా
పాకిస్తాన్‌లో ఎంత
ఇండియా పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో వైట్ రైస్ వినియోగం చాలా తక్కువ. ఏడాదిలో ఒక్కో వ్యక్తి కేవలం 18.74 కిలోల వైట్ రైస్ మాత్రమే తింటాడు.
చైనా, ఇండియాలో ఎంతెంత
చైనాలో ఒక్కొక్క వ్యక్తి ఏడాది వ్యవధిలో 128.99 కిలోల వైట్ రైస్ తింటే ఇండియాలో ఏడాదికి 104.29 కిలోల బియ్యం తింటాడు
మూడో స్థానంలో మయన్మార్
ఇండియాకు పొరుగు దేశమైన మయన్మార్ దేశంలో వైట్ రైస్ వాడకం చాలా ఎక్కువ. ఏడాది వ్యవధిలో ఒక్కొక్క వ్యక్తి 263 కిలోల బియ్యం తింటాడు.
రెండవ స్థానంలో కోమోరోస్
గాంబియా తరువాత తూర్పు ఆఫ్రికా దేశమైన కోమోరోస్‌లో అత్యధికంగా బియ్యం తింటారు. ఈ దేశంలో ఒక్కొక్క వ్యక్తి ఏడాది వ్యవధిలో 295 కిలోల వైట్ రైస్ తింటాడని అంచనా
వైట్ రైస్ ఎక్కువగా తినే దేశం గాంబియా
2024 అధ్యయనం ప్రకారం మొత్తం ప్రపంచంలో పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబీయోల వైట్ రైస్ అత్యధికంగా తింటారు. 2021లో ఈ దేశంలో ఒక్కొక్క వ్యక్తి 378.88 కిలోల బియ్యం ఏడాది వ్యవధిలో తిన్నట్టు తెలుస్తోంది
ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో వైట్ రైస్ వినియోగం చాలా ఎక్కువ. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వైట్ రైస్ లేకుండా ఉండదు. అదే విధంగా ఇతర దేశాల్లో కూడా వైట్ రైస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఎక్కువగా కన్పిస్తుంది