World Busiest Railway Station: ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైల్వే ద్వారా ప్రయాణాలు చేస్తుంటారు. తక్కువ ధరకే ప్రయాణం.. సుదూర గమ్యస్థానాలను ప్రజలను చేరుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణీకులు రైలు ప్రయాణం ఎంచుకుంటారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ ఏది తెలుసా? ఈ రైల్వేస్టేషన్‌లో మొత్తం 36 ప్లాట్‌ఫారమ్స్, 20 ప్రవేశ ద్వారాలతో అత్యంత రద్దీగా ఉండే రైల్వేస్టేషన్. అయితే, ఇండియా, చైనా, యూఎస్ మాత్రం కాదు..
ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రయాణం చేసే రవాణా వ్యవస్థ రైల్వే. మన దేశంలో కూడా రైలు ప్రయాణం ద్వారా ప్రతిరోజూ కొన్ని లక్షలాది మంది ప్రయాణం చేస్తారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఒకటి ఉందని మీకు తెలుసా? విచిత్రంగా ఎక్కువ జనాభా ఉండే ఇండియా, చైనా మాత్రం కాదు.
మన దేశంలో అయితే, అత్యంత రద్దీ ఉండే రైల్వే స్టేషన్ ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే రైల్వే స్టేషన్ జపాన్‌లోని షింజుకు. అవును ఈ రైల్వే స్టేషన్ ద్వారా ప్రతి రోజు ఎంతో మంది ప్రయాణం చేస్తూ ఉంటారు.
జపాన్‌లోని టోక్యోలో ఉన్న షింజుకు ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే రైల్వే స్టేషన్. ప్రతిరోజూ ఈ స్టేషన్ ద్వారా 3.8 మిలియన్‌ల మందితో రద్దీగా ఉంటుంది. నిత్యం ఈ రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో బిజీగా కనిపిస్తుంది.
ఈ రైల్వే స్టేషన్‌లో మొత్తం 36 ప్లాట్‌ఫారమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క సెకనుకు ఒక ట్రైన్ కచ్చితంగా రావడం లేదా బయలుదేరడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో శాటిటైట్ స్టేషన్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, షాపింగ్ సెంటర్స్, అండర్‌గ్రౌండ్ ప్రయాణీకులతో ఉంటుంది.
అంతేకాదు ఈ షింజుకు రైల్వే స్టేషన్‌లో 200 ప్రవేశం, ఎగ్జిట్ ద్వారాలు ఉంటాయి. ప్రతిరోజూ 1.27 బిలియన్ ప్రయాణీకులు ఒక ట్రైన్ నుంచి మరో ట్రైన్‌కు మారతారు. అందుకే షింజుకు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది.
ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న భారత్, చైనా, పాకిస్తాన్, యూఎస్ కాకుండా అనూహ్యంగా జపాన్‌లో వరల్డ్ రద్దీ ఉండే రైల్వే స్టేషన్‌గా పేరుగాంచింది. ఈ రైల్వేస్టేషన్ ఏ ఒక్క సంస్థ కింద పనిచేయడం లేదు. అక్కడి ప్రభుత్వ, ప్రైవేటు, మెట్రో లైన్‌లను అనుసంధానించి ఉంది.
అంతేకాదు ఇక్కడ ప్రయాణీకులు ప్రవేశద్వారాలు, ప్లాట్‌ఫారమ్‌ల విషయంలో గందరగోళానికి గురవ్వడం కూడా ఖాయం. అక్కడ ప్రధాన ప్రవేశద్వారాలతోపాటు సబ్‌వేలు కూడా ఉంటాయి. ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి. షింజుకు టోక్యోకు ఒక వాణిజ్య కేంద్రంగా మారుతోంది.