WPL 2026 Retentions Full List: WPL 2026 మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. నవంబర్ 27న మెగా వేలం జరగనుండగా.. ఒక్కొ టీమ్ గరిష్టంగా ఐదుగురు (ముగ్గురు భారత, ఇద్దరు విదేశీ) ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఐదు స్లాబ్‌ల ప్రకారం ప్లేయర్లను రిటైన్ చేసుకుని.. మిగిలిన వారిని వేలంలోకి రిలీజ్ చేశాయి. ఏ టీమ్ నుంచి ఎవరు రిటైన్ అయ్యారు..? ఎవరికి ఎంత అమౌంట్ దక్కింది..? పూర్తి వివరాలు ఇలా..
ఈసారి మెగా వేలంలో రైట్-టు-మ్యాచ్ (RTM) కార్డులు కీలకంగా మారనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి స్టార్ క్రికెటర్లకు రిటెన్షన్‌లో ఎక్కువగా దక్కించుకున్నారు. అలిస్సా హీలీ, మెగ్ లాన్నింగ్ వంటి స్టార్లు ఈసారి వేలంలోకి రానున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ జెమిమా రోడ్రిగ్స్ (₹3.50 కోట్లు)తోపాటు షెఫాలీ వర్మ (₹2.50 కోట్లు), మారిజానే కాప్ (₹2.2 కోట్లు), అన్నాబెల్ సదర్లాండ్ (₹ 2.2 కోట్లు), నికి ప్రసాద్ (₹ 50 లక్షలు)లను రిటైన్ చేసుకుంది. ఢిల్లీ పర్స్‌లో పర్స్‌లో ₹5.7 కోట్లు ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ జెమిమా రోడ్రిగ్స్ (₹3.50 కోట్లు)తోపాటు షెఫాలీ వర్మ (₹2.50 కోట్లు), మారిజానే కాప్ (₹2.2 కోట్లు), అన్నాబెల్ సదర్లాండ్ (₹ 2.2 కోట్లు), నికి ప్రసాద్ (₹ 50 లక్షలు)లను రిటైన్ చేసుకుంది. ఢిల్లీ పర్స్‌లో పర్స్‌లో ₹5.7 కోట్లు ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుని.. ఒక ఆర్టీఎమ్ కార్డు నిలుపుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన (₹3.50 కోట్లు), ఎల్లీస్ పెర్రీ (₹ 2.75 కోట్లు) రిచా ఘోష్ (₹ 2 కోట్లు), శ్రేయంక పాటిల్ (₹ 60 లక్షలు)లను రిటైన్ చేసుకుంది. ఆర్‌సీబీ పర్స్‌లో ₹6.15 కోట్లు ఉన్నాయి.
గుజరాత్ జెయింట్స్ కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కెప్టెన్ బెత్ మూనీ (₹3.50 కోట్లు), ఆష్లీ గార్డనర్ (₹2.50 కోట్లు)లను రిటైన్ చేసుకుని.. మిగిలిన ప్లేయర్లను వేలంలోకి రిలీజ్ చేసింది.
యూపీ వారియర్స్ కేవలం ఒక్కరినే రిటైన్ చేసుకుని షాక్చింది. శ్వేతా సెహ్రావత్ (₹30 లక్షలు) రిటైన్ చేసుకుని.. ₹14.70 కోట్లతో మెగా వేలానికి వెళ్లనుంది. దీప్తి శర్మ, అలిస్సా హీలీ వంటి స్టార్లను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఏ టీమ్ పర్స్‌లో ఎంత అమౌంట్ ఉందంటే..? ==> RCB: ₹6.15 కోట్లు ==> MI: ₹5.7 కోట్లు ==> DC: ₹5.7 కోట్లు ==> UPW: ₹14.5 కోట్లు ==> GG: ₹9 కోట్లు