Year Ender 2025 Gold - Silver Rates: 2025లో బంగారం, వెండి ధరలు హిస్టరీ క్రియేట్ చేశాయి. చరిత్రలో ఏనాడూ పెరగనంతగా ఈ ఏడాదిలోనే పెరిగాయి. బంగారం దాదాపు 50శాతానికిపైగానే పెరిగింది. బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టిన వారికి కాసుల వర్షం కురిపించింది. అయితే ఎఫ్ పీఐ అవుట్ ఫ్లూలు, ప్రపంచ ఒత్తిడి మధ్య భారత స్టార్ మార్కెట్ బలహీనంగా కొనసాగింది. ఈ ఏడాదిలో బంగారం, వెండి, స్టాక్ మార్కెట్ ఈ మూడింటిలో ఏది అద్భుతాలు చేసిందో తెలుసుకుందాం.
1/8భారతీయ ఇన్వెస్టర్లకు అద్భుతమైన ఏడాది 2025. కానీ ఈ ఏడాది అందర్నీ సంతోషపెట్టలేదు. బంగారం, వెండి అద్భుతమైన రాబడిని అందించాయి. కానీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం నిరాశపరిచాయి. సాంప్రదాయ పెట్టుబడి, ఆధునిక ఈక్విటీ మార్కెట్ మధ్య ఒక అద్భుతమైన కలయిక భారత ఇన్వెస్టర్ల నమ్మకాలను, వ్యూహాలను పైకి తీసుకెళ్లింది.
2/8ఈ ఏడాది బంగారం, వెండి మార్కెట్ పెట్టుబడిదారులకు ఊపిరి ఆడనివ్వని పరిస్థితిని తీసుకొచ్చింది. ప్రత్యేకంగా బంగారం ధర నెలనెలా తీవ్ర హెచ్చుతగ్గులు ఎదుర్కొన్నా.. మొత్తంగా అయితే భారీ ఎగబాకుతూ టెన్షన్ జర్నీ చేసింది. కొత్త ఏడాది ప్రారంభమైన జనవరి 1న 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,000 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.71,500 పలికింది. అదే నెల చివరికి 24 క్యారెట్ల ధర రూ.84,000కు పెరిగింది. ఫిబ్రవరి ముగిసే నాటికి బంగారం ధర మరింత ముందుకు దూసుకెళ్లి రూ.86,840ను తాకింది.
3/8మార్చి నెలలో ధరలు మరింత పెరుగుతూ 24 క్యారెట్ల బంగారం రూ.90,660కు చేరగా, 22 క్యారెట్ల రేటు రూ.83,310 వద్ద నిలిచింది. ఏప్రిల్‌లో మార్కెట్ మరింత ఉత్కంఠను రేపింది. ఈ నెల 15వ తేదీ నాటికి తులం బంగారం ధర రూ.95 వేల మార్క్‌ను అధిగమించింది. అయితే మేలో కొద్దిగా వెనక్కి వచ్చి రూ.93 వేల వద్దకు చేరింది. అంటే ఒక్క నెల వ్యవధిలో దాదాపు రూ.2 వేల దిగివచ్చినట్లు.
4/8జూన్ నెలలో బంగారం ఒక్కసారిగా భారీ జంప్ నమోదు చేసింది. జూన్ 16న తులం ధర రూ.1,00,510 దాటింది. అయితే జూలైలో మళ్లీ తగ్గుదల వచ్చి రూ.99,770కు చేరింది. ఆ తర్వాత ఆగస్ట్‌లో చిన్న ఎగబాకు నమోదు కాగా సెప్టెంబర్‌లో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ నెలలో బంగారం రూ.1,11 వేల మైలురాయిని దాటింది. అంతేకాదు 30వ తేదీ నాటికి తులం ధర రూ.1,17 లక్షలకు చేరింది.
5/8అక్టోబర్ బంగారం ధరలకు అత్యంత కీలక నెలగా నిలిచింది. 20వ తేదీ నాటికి తులం ధర రూ.1,30,690 దాటిపోయి రికార్డులను చెరిపేసింది. కానీ తరువాత అదే వేగంతో పడిపోయి నెలాఖరులో రూ.1,23 వేల స్థాయికి చేరుకుంది. నవంబర్ ప్రారంభంలో బంగారం ప్రశాంతంగా సాగినా, 20 తర్వాత మళ్లీ పెరుగుతూ నెలాఖరున రూ.1,29,820 వద్ద నిలిచింది.
6/8డిసెంబర్ ప్రారంభంలో కూడా ఇదే ధోరణి కొనసాగి 5వ తేదీ నాటికి తులం బంగారం ధర రూ.1,29,930గా ఉంది. మొత్తంగా చూసుకుంటే జనవరి నుండి డిసెంబర్ వరకు తులం బంగారం దాదాపు రూ.51,930 పెరుగుదల నమోదు చేసింది. ఒక్క సంవత్సరంలో బంగారం అంతకంతకు ఖరీదవడం సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ఊపిరాడనివ్వకుండా చేసింది.
7/8వెండి విషయానికొస్తే బంగారంలా అడుగు ఆగలేదు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో వెండి ధర రూ.90,000 ఉండగా, జూన్ నాటికి ఇది రూ.1,10,000కు చేరుకుంది. డిసెంబర్ 5వ తేదీ నాటికి వెండి ధర రూ.1,87,000కు పెరిగింది. అంటే 2025 ప్రారంభం నుండి చివరివరకు కిలో వెండిపై దాదాపు రూ.90 వేల కన్నా ఎక్కువ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పరికరాలు, పరిశ్రమల్లో వెండి వినియోగం పెరగడంతో ధరలు పెరిగాయి.
8/82025లో భారత స్టాక్ మార్కెట్ కథ నిరాశ, అంచనాల మధ్య కొనసాగింది. ఈ ఏడాది బీఎస్ఈ సెన్సెక్స్ కేవలం 5.30 శాతం మాత్రమే రాబడిని అందించగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 6.38 శాతం రాబడిని ఇచ్చింది. ఈ రాబడి బంగారం, వెండి కంటే చాలా వెనుకబడటమే కాకుండా.. ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే దేశ పనితీరు కూడా చెత్తగా ఉంది. ప్రపంచంలోని 17 ప్రధాన స్టాక్ సూచీలలో, భారతదేశ సెన్సెక్స్ అత్యల్పంగా ఉంది. ఈ స్వల్ప పనితీరుకు అనేక కారణాలు కారణమవుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. 2025లో ఇప్పటివరకు, విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుండి రికార్డు స్థాయిలో రూ. 1.43 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు.