HDFC Infinia Credit Card: బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. HDFC ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు గొప్ప ఆఫర్ ప్రకటించింది. SmartBuy పోర్టల్ ద్వారా Myntra వోచర్ తీసుకుని, బంగారు నాణేలు కొనుగోలు చేస్తే 17శాతం వరకు ఆదా చేయవచ్చు. ఇది ప్రీమియం కస్టమర్లకు బంగారంలో పెట్టుబడికి అద్భుతమైన అవకాశమని చెప్పువచ్చు.
1/10దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అక్టోబర్ 14, 2025 నాటికి, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,30,525 దాటేసింది. పెరుగుతున్న ఈ ధరల నేపథ్యంలో చాలా మంది పెట్టుబడిదారులు బంగారంలో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నారు. అయితే, మీ వద్ద HDFC ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ ఉంటే, ఇప్పుడు మీరు బంగారాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసే అద్భుత అవకాశం పొందవచ్చు.
2/10ఈ ఆఫర్ ద్వారా మీరు 17శాతం వరకు డిస్కౌంట్‌తో బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు. బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో ఇది ఒక పెద్ద సౌలభ్యం అని చెప్పవచ్చు. ఈ ఆఫర్‌తో మీరు డబ్బు ఆదా చేయడమే కాకుండా, HDFC ఇన్ఫినియా కార్డు ద్వారా లభించే ప్రీమియం ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
3/10మీరు ముందుగా HDFC SmartBuy పోర్టల్‌లోకి వెళ్లి, Myntra వోచర్ కొనుగోలు చేయాలి. ఈ వోచర్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీరు సుమారు 16.66శాతం వరకు (దాదాపు 17శాతం) క్యాష్‌బ్యాక్ లేదా డిస్కౌంట్ పొందుతారు. ఈ వోచర్‌ల ద్వారా నెలకు గరిష్టంగా రూ. 15,000 వరకు పొదుపు చేయవచ్చు.
4/10వోచర్ కొనుగోలు చేసిన తర్వాత, మీరు Myntra వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బంగారు నాణేలను కొనుగోలు చేయాలి. చెల్లింపుల సమయంలో మీరు ముందుగా తీసుకున్న వోచర్‌ను ఉపయోగించవచ్చు. ఈ విధంగా మీరు బంగారం కొనుగోలుపై 17శాతం వరకు ఆదా చేయగలుగుతారు.
5/10ఇది సాధారణంగా అందరికీ తెలిసిన ఆఫర్ కాదు.. కానీ చాకచక్యంగా ఉపయోగించుకున్నవారికి మంచి లాభదాయక అవకాశమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న బంగారు ధరల మధ్య ఇలాంటి పొదుపు ఒక గొప్ప డీల్‌గా చెప్పుకోవచ్చు.
6/10HDFC ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ భారతదేశంలో అత్యంత లగ్జరీ, ప్రెస్టీజియస్ క్రెడిట్ కార్డులలో ఒకటి. ఇది ఎక్కువ ఆదాయం పొందే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కార్డుతో ప్రయాణం, ఫుడ్, గోల్ఫ్, షాపింగ్ వంటి విభాగాల్లో అనేక ప్రత్యేక రివార్డులు, లౌంజ్ యాక్సెస్‌లు, ప్రీమియం సర్వీసులు లభిస్తాయి.
7/10మెటల్ ఎడిషన్‌లో కూడా అందుబాటులో ఉన్న ఈ కార్డుకు రూ. 12,500 వార్షిక ఫీజు ఉంటుంది. కానీ మీరు ఏడాదిలో రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తే, ఆ ఫీజు ఆటోమేటిక్‌గా మాఫీ అవుతుంది. ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి బ్యాంకుతో ఉన్న మీ రిలేషన్‌షిప్ విలువను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
8/10ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బంగారం పెట్టుబడిదారులకు ఒక సేఫ్ హేవెన్‌గా మారింది. మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి మధ్య, బంగారం దీర్ఘకాల పెట్టుబడికి మంచి రిటర్న్స్ ఇస్తోంది. HDFC ఇన్ఫినియా కార్డు ఆఫర్‌ను ఉపయోగించి, మీరు ఈ పెట్టుబడిని మరింత తెలివిగా, తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు.
9/10మొత్తంగా, పెరుగుతున్న బంగారం ధరల మధ్య, HDFC ఇన్ఫినియా కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేయడం ఒక ప్రీమియం డీల్ అని చెప్పవచ్చు. ఇది మీకు పొదుపు మాత్రమే కాకుండా, అధిక స్థాయి సౌలభ్యాన్ని కూడా ఇస్తుంది.
10/10Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.