YS Jagan Diet Plan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిట్‌నెస్ లో చాలా మందికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఆయన ఫిజికల్ ఫిట్‌నెస్ , డ్రెస్ సెన్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఆయన్ను అభిమానించే వాళ్లు చాలా మంది దాన్ని యాజ్ టీజ్ గా ఫాలో అవుతుంటారు. అలాంటి ఫిజిక్ కోసం జగన్ మోహన్ రెడ్డి చేస్తారన్న విషయం చాలా మందికి తెలుసు. ఇంటర్య్వూలకు దూరంగా ఉండే జగన్.. తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా స్పందించరు. అందుకే చాలా మందికి జగన్ డైట్, అండ్ ఫిట్‌నెస్ గురించి ఎలాంటి విషయాలు తెలియవు.
జగన్ రెడ్డి ఎప్పటినుంచో ఫిట్‌నెస్ పరంగా చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ముఖ్యంగా మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు బహిరంగ వేదికలపై వెల్లడించారు.
తన ప్రవర్తన, జీవనశైలితోనే నాయకత్వం చూపాలని ఆయన నమ్మకం. ఒక నాయకుడు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఉంటేనే ప్రజలు అతన్ని ఫాలో అవుతారని ఆయన ఎప్పుడూ చెబుతారు. జగన్ వ్యక్తిగత జీవితం, డైట్ రహస్యాల గురించి ఆయన చాలా ప్రైవేట్‌గా ఉంటారు. మీడియా ఇంటర్వ్యూలు కూడా అరుదుగా ఇస్తారు. అందుకే ఆయన నిజమైన ఫిట్‌నెస్ రహస్యాలు, డైట్ హ్యాబిట్స్ చాలా మందికి తెలియవు.
అయితే జగన్ రోజూ ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ మాత్రమే తింటారట. వారంలో ఒక్కరోజు మాత్రమే మాంసాహారం తీసుకుంటారట. నాన్‌వెజ్‌లో ఆయనకు ఎక్కువ ఇష్టం ఉన్నది కీమా. అది కూడా చాలా తక్కువ మోతాదులోనే తింటారట. పాదయాత్ర సమయంలో ఆయనతో పాటు ఉండగా, జగన్ ఆహార అలవాట్లు తన సన్నిహితులు గమనించారట.
అయితే జగన్ తీసుకునే ఎనర్జీ డ్రింక్ ఏంటంటే.. హోమ్‌మేడ్ డ్రింక్ తాగుతారట. ఒక లీటర్ పాలలో పచ్చి అల్లం వేసి బాగా మరిగిస్తే చివరికి ఒక గ్లాసు మాత్రమే మిగులుతుందని.. ఆ పాలు జగన్ ప్రతిరోజూ తాగుతారట. ఇది శరీరానికి శక్తిని ఇస్తుందని, ఇమ్యూనిటీని పెంచుతుంది.
జగన్‌కు మామిడి పులిహోర, రాయలసీమ స్పెషల్ చిత్రాన్నం అంటే చాలా ఇష్టం. మామిడికాయ తురిమి చేసే పులిహోర ఆయనకు ఫేవరెట్ డిష్. అంతేకాదు, పల్లీలు, మొక్కజొన్న పొత్తులు ఆయన రోజువారీ డైట్‌లో భాగం.
ఫ్రూట్ జ్యూసులు కూడా రెగ్యులర్‌గా తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఆయన తీసుకునే జాగ్రత్తలు, మితాహార జీవనశైలి ఇప్పుడు చాలామందికి ప్రేరణగా మారాయి.