JanaSena Party Jayaketana Sabha Photos: రాజకీయ పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన సభతో టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్ ఇచ్చింది. ఏమిటి? ఎందుకో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారిన జనసేన పార్టీ 11వ వార్షికోత్సవం చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది.
పీ రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ ఇంతటి భారీ బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి. జయకేతనం పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతమైంది. సభ సక్సెస్‌తో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగాయి.
చిత్రాడలో నిర్వహించిన బహిరంగ సభ భారీ విజయం కావడంతో మిత్ర పక్షాలతోపాటు ప్రతిపక్ష పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్‌లో జనసేన పార్టీ బలీయమైన శక్తిగా చాటి చెప్పేందుకు ప్రయత్నించారు.
జయకేతనం సభకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి అభిమానులు తరలివచ్చారు. వేలాది మధ్య జరిగిన ఈ సభతో ఇతర పార్టీలకు జనసేన పార్టీ గట్టి హెచ్చరిక చేసినట్టు భావించవచ్చు.
జయకేతనం సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొన్ని గంటల పాటు ఆ కార్యక్రమాలు కొనసాగగా.. నాగేంద్రబాబు, నాదెండ్ల మనోహర్‌తోపాటు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ బహిరంగ సభతో జనసేన పార్టీ ఇతర పార్టీలకు ఓ సందేశం ఇచ్చింది. భవిష్యత్ మొత్తం జనసేన పార్టీదేనని ఈ సభ ద్వారా ఆ పార్టీ చాటి చెప్పిందని భావించవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ గడ్డపైన ఏర్పడినా కూడా జనసేన పార్టీ నేటి విభజిత ఆంధ్రప్రదేశ్‌పైనే ప్రధాన దృష్టి సారించింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా జనసేన పార్టీ మారిన విషయం తెలిసిందే.
2014 ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. 2019లో పోటీ చేసి ఘోర పరాభవం ఎదుర్కొన్న జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. 21 ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒకరు ఎమ్మెల్సీ జనసేన పార్టీకి ఉన్నారు.