Add Zee Business As A Preferred Source
App

Zee Awards 2025: అట్టహాసంగా జీ తెలుగు అచీవర్స్‌ అవార్డ్స్‌ వేడుక.. ప్రముఖుల హాజరు..!

Written ByRenuka Godugu
Published: Sep 25, 2025, 11:40 AM IST|Updated: Sep 25, 2025, 11:40 AM IST

Zee Achievers Awards 2025: అట్టహాసంగా  జీ తెలుగు అచీవర్స్‌ అవార్డు వేడుక బుధవారం హైదరాబాద్ వేదికగా జరిగింది. అవార్డుల ప్రధాన ఉత్సవంలో భాగంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి జీ తెలుగు అచీవర్స్‌ అవార్డుల ప్రధానం జరిగింది. ఇక ఈ వేడుకకు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం 
 

Jalavihar1/7

జలవిహార్

 జీ తెలుగు అచీవర్స్ అవార్డు వేడుక అట్టహాసంగా 2025 సెప్టెంబర్ 24వ తేదీ బుధవారం వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని జలవిహార్ వేదికగా ఈ వేడుక జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.   

Zee Telugu Editor2/7

జీ తెలుగు ఎడిటర్

 ఈ వేడుకకు జీ తెలుగు ఎడిటర్ భరత్ ఆధ్వర్యంలో జీ తెలుగు అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇటీవలె పోలీస్ శాఖకు అవార్డులు అందించిన జీ తెలుగు న్యూస్.. తాజాగా వివిధ రంగాల్లోని విశేష కృషి చేసిన ప్రతిభావంతులైన వారికి అచీవర్స్‌ అవార్డుల ప్రధానం చేశారు.  

Zee Telugu3/7

 జీ తెలుగు

 జీ తెలుగు అవార్డుకు ముఖ్యఅతిథిగా  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, తనికెళ్ల భరణి, సీనియర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.  

Zee Telugu Achivers4/7

జీ తెలుగు అచీవర్స్‌

 జీ తెలుగు అచీవర్స్‌ అవార్డులో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆయన జీ తెలుగు న్యూస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పురస్కారాల వల్ల యువతను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇది అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు.  

Venkaiah Naidu5/7

వెంకయ్య నాయుడు

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మెయిల్ గ్రూప్ డైరెక్టర్ సుధా రెడ్డి ,ఎంపీ ఈటల రాజేందర్ పురస్కార గ్రహీత అయిన సీనియర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా జీ తెలుగు న్యూస్‌ను అభినందించారు.  

KTR6/7

కేటీఆర్

ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆయన సమాజంలో విశేషమైన కృషి చేస్తున్న వారికి ఇలా గుర్తింపు పురస్కారాలు ప్రదానం చేయడం ఎంతో గొప్ప పని అన్న అన్నారు. ఈ నేపథ్యంలో జీ తెలుగు న్యూస్ తో పాటు చీఫ్ ఎడిటర్ భరత్ కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.  

Harish Shankar7/7

హరీష్ శంకర్

అంతేకాదు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా జీ తెలుగును ప్రశంసించారు. అచీవర్స్ అవార్డు గ్రహీత తనికెళ్ళ భరణి కూడా జీన్ తెలుగు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. అట్టహాసంగా ఈ జీ తెలుగు వేడుకలు వైభవంగా జరిగాయి.