Jaipur Drunk Girl Video: ప్లీజ్ వదిలేయండి.. ఒకరి ప్రాణం తీసి వేడుకుంటున్న లిక్కర్ పాప.. వీడియో వైరల్..

14 Years old drunk girl in jaipur: మైనర్ బాలిక కారు డ్రైవింగ్ చేస్తు ఒకరి నిండు ప్రాణం బలితీసుకొవడమే కాకుండా.. మరో ఇద్దర్ని కూడా డెంజర్ లోకి నెట్టింది. ఈ ప్రమాదకర వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 1, 2025, 10:10 AM IST
  • తప్పతాగి కారును నడిపిన వ్యక్తి..
  • సీరియస్ అయిన స్థానికులు..
Jaipur Drunk Girl Video:  ప్లీజ్ వదిలేయండి.. ఒకరి ప్రాణం తీసి వేడుకుంటున్న లిక్కర్ పాప.. వీడియో వైరల్..

14 years old drunk girl accident video: ఇటీవల చాలా మంది ట్రాఫిక్ రూల్స్ లను అస్సలు పాటించడంలేదు. తాగి వాహనాలు నడిపించొద్దని పోలీసులు ఎంత చెప్పిన కూడా చాలా మంది తమ తీరుమార్చుకొవడంలేదు. రాంగ్ రూట్ లో వెళ్లడం, ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లను పెట్టుకొకపోవడం, సీట్ బెల్ట్ రూల్ ను పాటించడంలేదు. దీంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే.. కొంత మంది తప్పతాగి కూడా డ్రైవింగ్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

ఇంకా మైనర్ లు కూడా ఇలాంటి ఘటనల్లో ఉంటున్నారు. ప్రతిరోజు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్న కూడా.. ఇప్పటికి రోజు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా..  జైపూర్ లో ఒక మైనర్ బాలిక తప్పతాగి మరీ కారును నడిపింది. ఒకరి నిండు ప్రాణం తీసింది.

 

వివరాల్లోకి వెళ్తే.. రాజస్తాన్, జైపూర్ లో మార్గంలో 14 ఏళ్ల బాలిక కారును తప్పతాగి నడిపింది. ఆమె కారులో ఇద్దరు పురుషులు, మరోక యువతి ఉన్నారు.  ఈక్రమంలో కారు వేగంగా వచ్చి.. ముందుకు వెళ్తున్న ఒక బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న యువతి అక్కడికక్కడే చనిపోయింది.

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆపమన్న కూడా కారును ఆపకుండా వెళ్లేందుకు యువతి ట్రై చేసింది. దీంతో స్థానికులు ఆమెను ఆపి.. గట్టిగా నిలదీశారు. కారులో మద్యం బాటిళ్లు, వాళ్లంతా తాగి ఉండటంను స్థానికులు గుర్తించారు.  దీంతో ఆవేషంతో ఊగిపోయారు. ఆమెపై దాడికి సైతం దిగారు.

Read more: Wedding dates in May: మే నెలలో భారీగా పెళ్లిళ్లు.. వైశాఖ మాసంలో శుభ మూహుర్తాలు ఏంటంటే..?  

ఇంతలో పోలీసులు అక్కడకు వచ్చి యువతిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత యువతి తనను వదిలేయ్యాలని మద్యంమత్తులో అక్కడి వాళ్లను వేడుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు.. తప్పతాగిన పాపకు కఠినంగా పనిష్మెంట్ పడేలా చూడాలని పోలీసుల్ని డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News