King Cobra Mating Video: వామ్మో.. 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాల సయ్యాట.. మధ్యలో టవల్ విసిరిన రైతులు.. వీడియో వైరల్..

King Cobra Video: పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పదిహేను అడుగుల పొడవున్న రెండు కింగ్ కోబ్రాల సయ్యాటలు ఆడుతు హల్ చల్ చేశాయి.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటజన్లు బాబోయ్ అంటూ టెన్షన్ పడుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 19, 2025, 05:45 PM IST
  • ఏపీలొ భారీ కింగ్ కోబ్రాల మేటింగ్..
  • నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
King Cobra Mating Video: వామ్మో.. 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాల సయ్యాట..  మధ్యలో టవల్ విసిరిన రైతులు.. వీడియో వైరల్..

15 foot king cobra mating and dancing video: ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా పొలాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఎలుకలు తినేందుకు మనుషుల ఇంట్లోకి వస్తుంటాయి. అడవికి లేదా పెద్ద చెట్లు, గుబురుగా చెట్లు ఉంటే చోటు పాములు ఎక్కువగా సంచరిస్తాయి. పాములు కూడా మనుషుల్లానే సంభోగం చేస్తాయి.

Add Zee News as a Preferred Source

పాములు ఎక్కువగా పొలాల్లో సయ్యాటలు ఆడుతున్న ఘటనలు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. తాజాగా.. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కురుపాం మండలంలో రెండు భారీ కింగ్ కోబ్రాలు వచ్చాయి. అంతేకాకుండా.. అవి సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. అక్కడున్న రైతులు కింగ్ కోబ్రాలనుచూసి భయంతో వణికిపోయారు. 

 

మన్యం జిల్లా కురుపాం ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ సమీపంలో దట్టమైన పోలాలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దీంతో రెండు భారీ కింగ్ కోబ్రాలు అది కూడా దాదాపు.. 15 అడుగుల పొడవున్నవి ఒక దగ్గరకు చేరి సయ్యాటలాడుకుంటున్నాయి.ఈ ఘటనను అక్కడ వాళ్లు చూస్తు ఉండిపోయారు. మధ్యలో కొంతమంది వాటి మీద టవల్ ను విసిరారు.

Read more: Ramya Kancharla Video: లేత వయసులోనే అన్ని చూసేశా.!.. సైలెంట్‌గా బాంబు పేల్చిన రమ్య కంచర్ల.. వీడియో వైరల్..

దీంతో రెండు కోబ్రాలు చెట్లలోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకుగురౌతున్నారు. పాము కన్నా.. కింగ్ కోబ్రాలు చాలా డెంజర్ . ఇవి కాటు వేస్తే మాత్రం బతకడం చాలా డెంజర్ అని డాక్టర్లు చెబుతుంటారు. అందుకే ఆ కింగ్ కోబ్రాలను బంధించాలని గ్రామస్తులు ఫారెస్ట్ సిబ్బందిని కోరుతున్నారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News