)
Diamond In Right Eye Video Watch Here: వజ్రాలు ఎంతో అరుదైనవని అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇవి ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన వాటిగా భావిస్తారు. అందుకే వీటికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ధనవంతులు ఎక్కువగా ఇలాంటి ఖరీదైన వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో కంటిలో వజ్రాన్ని కలిగి ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కంటి భాగాన్ని కెమెరాకు చూపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అతను తన రెప్పలను అటు ఇటు ఆడిస్తూ ఉండడం కూడా గమనించవచ్చు. ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అందరూ ఎక్కువగా వజ్రాలను ఆభరణాలలో అమర్చేందుకు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది వాటితో వివిధ రకాల ఆభరణాలను తయారు చేసుకొని ధరిస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కంట్లో వజ్రాన్ని అమర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని అలభామా నివాసి.. గత కొద్ది రోజుల క్రితం తన కుడి కన్ను మసక బారింది. అయితే, దీనిని చికిత్స చేయించుకునేందుకు.. అమెరికాలోని ఓ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ అతని కన్ను స్థితిని చూసి వైద్యులు పూర్తిగా చూపుకోల్పోతామని చెప్పారు.
అలాగే వైద్యులు అతని కంటి చూపును కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.. అతని కుడి కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. కన్ను పూర్తిగా చూపు కోల్పోయినప్పటికీ.. కన్నులోని లోపలి భాగం అలాగే ఉండిపోయింది. దీంతో ఆ యువకుడికి ఒక ఆలోచన వచ్చింది. అతడు ధనికుడు కావడంతో.. కంటిలో ఆపరేషన్ ద్వారా వజ్రాన్ని అమర్చమని వైద్యులకు సూచిస్తాడు. అయితే చూపు కోల్పోయిన కుడి కంటిలో వైద్యులు ప్రత్యేకమైన చికిత్స ద్వారా.. కుడికంటిలో రెండు క్యారెట్లు కలిగిన వజ్రాన్ని అమర్చుతారు.
చికిత్సలో భాగంగా కుడి కంటిలో వజ్రాన్ని అమర్చి.. వైద్యులు ఆపరేషన్ ని సక్సెస్ చేస్తారు. అయితే అతనికి కుడి చూపు లేకపోయినప్పటికీ వజ్రం మాత్రం తల తల మెరుస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే @jonesjewelryco అనే ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు. ఇక అతని కంట్లో ఉన్న వజ్రం వివరాల్లోకి వెళితే.. దాదాపు ఇది రెండు మిలియన్ల డాలర్లు ఉన్నట్లు సమాచారం. అంటే భారత కరెన్సీలో దాదాపు 16 కోట్ల 95 లక్షలకు సమానమని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook