)
Huge Anaconda Video Viral: ఇటీవల యూట్యూబ్ వీడియోలో చూపించిన అత్యంత ప్రమాదకరమైన అనకొండ పాము చాలామంది సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో ఉన్న అత్యంత భారీ అనకొండ దాదాపు 25 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంత పెద్ద జంతువులనైనా ఎంతో సులభంగా మింగేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని వీడియోలో తెలిపారు. అలాగే ఇలాంటి పాములు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలే అప్పుడప్పుడు వైరల్‌గా మారుతూ ఉంటాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వీడియోలో ప్రధానంగా అనకొండాలకు సంబంధించిన వేటతీరు, బలమైన శరీర నిర్మాణం పై దృష్టిపెట్టి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌లో.. అనకొండలు చాలా శక్తివంతంగా ఉంటాయని.. అవి ఆహారాన్ని చుట్టేసి మరి ఊపిరాడకుండా చేసి మింగేస్తాయని తెలిపారు. వాటికి సాధారణ ఆహారం పెద్ద పెద్ద జంతువులని.. అలాగే ఇవి మనుషులపై కూడా ఎంతో సులభంగా దాడి చేసి అమాంతం మింగేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయని వీడియోలో క్లియర్‌గా తెలిపారు.
ఇలాంటి అనకొండ పాములు ఎక్కువగా అమెజాన్ అడవుల్లో పెరుగుతూ ఉంటాయి. భారత్‌లో కూడా ఇప్పటికీ కొన్నిచోట్ల ఇలాంటి పెద్ద పెద్ద పాములు కనిపిస్తూ ఉన్నాయని సమాచారం. ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ పెద్ద అనకొండ పాము తన భారీ శరీరంతో నీటి గుంటలో నుంచి పైకి చూస్తుండడం మీరు గమనించవచ్చు. అలాగే ఈ వీడియోను పాముకు చాలా దగ్గర నుంచి చిత్రీకరించినట్లు చూస్తే అర్థమయిపోతుంది. దీనికి సంబంధించిన వీడియోను @Shmarikaworld అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చాలామంది ఇలాంటి అత్యంత పెద్ద అనకొండ పామును జీవితంలో ఇప్పటికీ చూడలేమని చెబుతున్నారు. మరి కొంతమంది అయితే ఈ వీడియో కామెంట్ బాక్స్‌లో ఇది నిజమానని కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి