Giant Anaconda Viral Video Watch Here: అనకొండలు యూనెక్టస్ జాతికి చెందిన పాములుగా చెప్పుకుంటారు. అలాగే ఈ జాతుల్లో వివిధ రకాల పాములున్నప్పటికీ.. నాలుగు రకాల అనకొండ పాములు చాలా ప్రత్యేకం.. ముఖ్యంగా వీటిలో గ్రీన్ అనకొండ (యూనెక్టస్ మురినస్) అత్యంత ప్రమాదకరమైనవి పెద్దవిగా చెప్పుకుంటారు. అయితే ఇవి మగ అనకొండాలకంటే చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి దాదాపు 5 మీటర్ల నుండి 9 మీటర్ల పొడవు వరకు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని పాములైతే, ఏకంగా 11 నుంచి 12 మీటర్ల వరకు పొడవు పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరిగిన పాములు 280 కేజీల బరువు కూడా ఉంటాయని సమాచారం.. వీటి శరీరం అన్ని పాముల కంటే చాలా దృఢంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన కండరాలను కూడా కలిగి ఉంటుంది.
ఈ గ్రీన్ అనకొండ (యూనెక్టస్ మురినస్) పాములు ఆలివ్ ఆకుపచ్చ రంగుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా తల భాగం చాలా చిన్నదిగా ఉండి.. ప్రత్యేకమైన రంగులో కళ్లను కలిగి ఉంటూ ఉంటుంది. వీటి కళ్లు నీటిలో ఎక్కువగా షార్ప్‌గా పని చేస్తాయి. అలాగే ఈ పాములు ఎక్కువగా నదులు, సరస్సులు, చిత్తడి నేలల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కదిలే ప్రవాహాల్లో నివసించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాయి. అయితే ఇవి బలమైన శరీరాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి జింకలు, పందులు, నీటి పక్షులు, తాబేళ్లలను ఎక్కువగా వేటాడి చంపుకు తింటూ ఉంటాయి.
ముఖ్యంగా గ్రీన్ అనకొండలు ఎనుగు పిల్లలను కూడా చంపుకుని మరీ తింటూ ఉంటాయి. అయితే సాధారణ అనకొండాలతో పోలిస్తే.. ఈ గ్రీన్ అనకొండాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉంటాయి. తాజాగా గ్రీన్ అనకొండాకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో మీరు ఓ చిన్న పడవలో 270 కేజీల బరువు గల గ్రీన్ అనకొండ పామును చూడొచ్చు.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. సాధారణంగా కొంత మంది మత్స్యకారులు చేపలను పట్టుకునేందుకు చిత్తడి నెలలోకి పడవలో వెళ్తారు. అయితే వారి వలకు అనుకోకుండా పెద్ద అనకొండ పాము చిక్కతుంది. అయితే చేసేదేమిలేక వారు తమ పడవలో సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను "anaconda size" అనే ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. అలాగే దీనిని @Aloys-Mythical-q6f అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









