Tiger and Child Video: పులి, సింహాలు కన్పిస్తే ఎవరైనా భయపడిపోతుంటారు. జూలో కూడా అంత దూరం నుంచే చూస్తారు. దగ్గరకు వెళ్లేందుకు సాహసించరు. కానీ ఈ పిల్లోడు మాత్రం అందుకు అతీతం. ఏకంగా పెద్ద పులి నోటికి చిక్కినా సరే...ఆ కుర్రోడిలో పులి భయం కన్పించడం లేదు. అమ్మ భయం పట్టుకుది. అందుకే ఆ పులితో పేచీకు దిగాడు. అందుకే ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఓ పిల్లోడు కుటుంబంతో జూకి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ పెద్దపులి బోను వద్ద ఉన్నప్పుడు లోపల్నించి ఆ పులి కుర్రోడి టీ షర్ట్ నోట కరిచి లాగసాగింది. దాంతో ఆ కుర్రోడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పెద్ద పులి అంటే ఏ మాత్రం భయపడకుండా పేచీకు దిగాడు. తనను కాపాడండి అని కేకలు వేయకుండా..టీ షర్ట్ వదులు..చిరిగితే అమ్మ తిడుతుంది అంటూ పులిని బతిమాలుతున్నాడు. వాగ్వాదం చేస్తున్నాడు. అసలు ఆ కుర్రోడికి పెద్ద పులి దగ్గరున్నా సరే అమ్మ భయమే వెంటాడుతున్నట్టుంది. అందుకే పెద్ద పులి చంపేస్తుందని భయపడటం లేదు. టీ షర్ట్ చెరిగితే అమ్మ తిడుతుంది..నన్ను వదులు ప్లీజ్ అంటూ కేకలు పెట్టసాగాడు. అందుకే ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
Kid Starts shouting "Meri shirt chhod de, mummy Daantegi" after Tiger grabeed his shirt in Zoo
pic.twitter.com/gl07jglZ46— Ghar Ke Kalesh (@gharkekalesh) February 9, 2025
నెటిజన్లు కూడా ఇవే కామెంట్లు చేస్తున్నారు. పాపం పిల్లోడికి పెద్ద పులి కంటే అమ్మ భయమే ఎక్కువగా ఉన్నట్టుంది అంటున్నారు. మరో వ్యక్తి అయితే పిలికి, పులికి పిల్లలు భయపడరని, తల్లులకే భయపడతాని కామెంట్ చేశాడు. ఆ పిల్లోడికి పులిపై కంటే తన టీ షర్ట్ ఎక్కడ చిరుగుతుందో, ఎక్కడ తల్లి కొడుతుందో అనే భయమే వెంటాడుతోందని ఇంకొకరు పోస్ట్ చేశారు. ఆ పిల్లోడి తల్లి అంతలా భయపెడుతుందా అని మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం ఫన్నీగా ఉంది. తెగ వైరల్ అవుతోంది.
Also read: Anil-Chiru Movie: అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా ఫిక్స్, షూటింగ్ ఎప్పుడు, స్టోరీ లైన్ ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









