Viral Video: ఇలా ఉన్నాడేంట్రా..!.. మహిళ పోలీసుకే లైటింగ్ కొడుతున్న నిందితుడు.. వైరల్‌గా మారిన వీడియో..

lady cop video: నిందితుడ్ని పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతను పోలీసులు పక్కనే ఉన్న కూడా లేడీ పోలీసువైపు చూస్తే వెకిలీ చేష్టలు వేశాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 19, 2025, 03:52 PM IST
  • లేడీ కాప్ పట్ల వెకిలి చేష్టలు..
  • వీడియో వైరల్..
Viral Video: ఇలా ఉన్నాడేంట్రా..!.. మహిళ పోలీసుకే లైటింగ్ కొడుతున్న నిందితుడు.. వైరల్‌గా మారిన వీడియో..

Accused misbehaves with lady cop video: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా కొంత మంది కామాంధుల్లో మాత్రం మార్పులు రావడంలేదు. దిశ, నిర్భయ , పోక్సో వంటి ఎన్ని కఠిన చట్టాలు ఉన్న.. తమకేం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఆడది కన్పిస్తే చాలు వెకిలీ వేషాలు వేస్తున్నారు. చాలా చోట్ల అసలు.. ఇంటి నుంచి బైటకు వెళ్లిన మహిళలు తిరిగి వచ్చే వరకు ఇంట్లో వాళ్లకు చాలా టెన్షన్ లు పెట్టేదిగా మారింది. మొత్తంగా ఇటీవల కొంతమంది కేటుగాళ్లను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

 

ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో కూడా వీళ్లుచేస్తున్న వేధవ వేషాలను తమ ఫోన్ లలో రికార్డులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పోకిరీలు  అరెస్ట్ చేసిన కూడా తప్పు చేశామన్న భావన మాత్రం వారిలో కల్గడంలేదు. అదేదో జైలు అంటే అత్తారింటికి వెళ్లివచ్చినట్లు కొంతమంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అతడ్ని మీడియా సమావేశంలో ప్రవేశ పెట్టారు.

మరీ అతను ఏ కేసులో అరెస్ట్ అయ్యాడో కానీ.. మొత్తంగా అతడ్ని పోలీసులు ఫెస్ మాస్క్ తీసి మరీ అతగాడ్ని పోలీసులు అందరికి తెలిసేలా చేశారు. ఇంతలో అతను మాత్రం అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు పక్కన ఉన్న లేడీ పోలీసును చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ వెకిలి వేశాలు వేశాడు. అధికారిణి సైతం.. అతడ్ని చూసి వీడెంటీ ఇలా అని సీరియస్ అయ్యింది.

పక్కనే ఉన్న మరో పోలీసు.. ఇతని నిర్వాకం చూసి సీరియస్ గా మందలిస్తాడు. మొత్తంగా ఈవీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. పోలీసుల ముందే ఇలా ఉన్నాడంటే.. వీడు బైట ఎంత మందిని వేధించాడో అని సీరియస్ అవుతున్నారు. మరికొందరు ఇతడికి కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Read more:  Ramya Kancharla Video: లేత వయసులోనే అన్ని చూసేశా.!.. సైలెంట్‌గా బాంబు పేల్చిన రమ్య కంచర్ల.. వీడియో వైరల్..  

మరీ ఇది నిజంగా జరిగిందా... లేదా .. రీల్స్ లో భాగంగా ఇలా చేశారా..?.. అన్నది మాత్రం తెలియరాలేదు. కానీ పోలీసు దుస్తులు ధరించి ఇలాంటి పనులు చేసి.. పోలీసు శాఖకు చెడ్డపేరు వచ్చేలా చేశారని కొంతమంది నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News