)
Actress Meenakshi Chaudhary Visits Tirumala Temple video: కలియుగ దైవం, భక్తులు కొంగు బంగారం తిరుమల శ్రీవారిని టాలీవుడ్ స్టార్ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో నటికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేకంగా దర్శనం కల్పించి, వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో నటి మీనాక్షి చౌదరి ఆలయం నుంచి బైటకు వస్తుండటంతో అభిమానులు భారీగా ఆమె చుట్టు చేరుకుని సెల్ఫీ ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. నటి అందరితో ఫోటోలు దిగుతూ, నవ్వుతూ పలకరించారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి @Meenakshiioffl pic.twitter.com/W9OmoDH2mk
— greatandhra (@greatandhranews) September 18, 2025
మరోవైపు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి – సుశాంత్ డేటింగ్ రూమర్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు కూడా ఇటీవల ఎయిర్ పోర్ట్ లో సన్నిహితంగా కన్పించారు.
దీంతో వీరి మధ్య వస్తున్న పుకార్లకు మరింత బలంచేకూర్చే విధంగా మారింది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్ ఈ భామ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం.. చిరంజీవి హీరోగా చేస్తున్న విశ్వంభరలో కూడా ఈ భామకు చాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook