Lady Aghori and sri varshini honeymoon trip goes viral: లేడీ అఘోరీ, శ్రీవర్షిణిలు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే..దీనిపైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు.. అఘోరీ తో పెళ్లంటని కూడా శ్రీవర్షిణిని ఏకీపారేస్తున్నారు. ఆడ, మగకానీ వ్యక్తితో పెళ్లి చేసుకుని ఏ సుఖపడతావ్ అంటూ కూడా కొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శ్రీ వర్ణిని మాత్రం తన ఇష్ట ప్రకారమే అఘోరీ కోసం తాను వచ్చానని.. ఎవరి బలవంతంలేదని కూడా స్పష్టం చేసింది. అఘోరీ తనను బాగా చూసుకుంటున్నాడని.. తనను మాత్రం నేను భర్తగా భావిస్తున్నట్లు కూడా చెప్పకొచ్చింది.
ఇటీవల రాధిక అనే యువతి అఘోరీ తనను మొదట పెళ్లి చేసుకున్నాడని కూడా మీడియా ఎదుటకు వచ్చింది. దీన్ని లేడీ అఘోరీ ఖండించింది. ఆ మహిళ తన భర్త తనను వదిలిపెట్టి వెళ్లిపోయాడని.. ఆమెను తాను.. మంచి మాటలు చెప్పి డీప్రెషన్ నుంచి బైటకు తీసుకొచ్చినట్లు కూడా చెప్పారు. మరోవైపు మొకిలా పీఎస్ లో ఒక లేడీ ప్రొడ్యూసర్ అఘోరీ మీద ఫిర్యాదు కూడా చేసింది.
దీనికి కూడా గతంలో ఒక జడ్జీ తన దగ్గర పూజలు చేయించుకున్నాడని.. ఈ మహిళ మధ్యవర్తిగా ఉంటానని చెప్పి.. డబ్బుల విషయంలో మోసం చేసిందని కూడా అఘోరీ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీవర్షిణిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నానని లేడీ అఘోరీ చెప్పింది. తాము అనేక ఆలయాలను సందర్శిస్తున్నామని.. దయచేసి తమను ఎవరు ఇబ్బందులకు గురిచేయోద్దని కూడా కొత్త దంపతులు రిక్వెస్ట్ చేశారు.
అయితే.. అఘోరీ , శ్రీవర్షిణి పెళ్లి సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది. దీనిపై కొంత మంది నెటిజన్లు వీళ్లకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. వీళ్లను ట్రోల్స్ చేస్తున్నారు. లేడీ అఘోరీతో హనీమూన్ కు ఎక్కడికి వెళ్తున్నావని కూడా ప్రశ్నలు వేస్తున్నారు.
మరికొందరు ప్రస్తుతం లేడీ అఘోరీ కశ్మీర్ కు హనీమూన్ కు వెళ్లనుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కులు, మనాలీకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ లు వేసుకుందని కూడా వార్తల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తంగా వీరి పెళ్లి మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









