Aghori Wearing Cobra Viral Video Watch: అఘోరాల నమ్మకాలు, ఆచారాలు సాధారణ హిందూ మతానికి చాలా భిన్నంగా ఉంటాయి. వారి అవతారం చూడడానికి శివుడి భైరవ రూపంలో కనిపిస్తూ ఉంటారు. ఇక లేడీ అఘోరిలైతే, కాళీ మాత రూపంలో కనిపిస్తారు. వీరు ఎక్కువగా శివుడితో పాటు కాళీక మాతను ఆరాధిస్తారు. అలాగే వీరికి మంచి-చెడు, పవిత్రం-అపవిత్రం వంటి ద్వంద్వాలు ఉండవని కూడా చెప్పుకుంటారు. విశ్వంలో ప్రతిదీ దైవికమైనదేనని.. ఈ ద్వంద్వాలను అధిగమించడం వల్ల ఊహించని ప్రయోజనాలతో పాటు మోక్షం లభిస్తుందని వారి నమ్మకం..
అఘోరాలు సాధారణంగా స్మశాన వాటికల్లో నివసిస్తారు. అంతేకాకుండా వారి సాధనలు కూడా స్మాశానల్లోనే చేస్తారు. అలాగే వీరు మరణం అనేది జీవితంలో ఒక భాగమని, భయం లేకుండా దానిని స్వీకరించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అలాగే వీరు మరణించిన వారి దేహాల బూడిదను వారి శరీరాలకు పూసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది అఘోరాలు మెడలో పాములను కూడా ధరిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ అఘోరా పామును ధరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. పొడవాటి జుట్టు కలిగిన అఘోరా ద్యానం చేస్తుడడం గమనించవచ్చు. అయితే ఇదే సమయంలో అతడి తల భాగంలో ఏదో కదలడం కూడా గమనించవచ్చు. అదేంటో కాదు, అతి ప్రమాదకరమైన నల్ల నాగుపాము.. తన జుట్టుకు చుట్టుకుని ఉన్న పాము, ముఖం భాగంలో పాము తల భాగం చూడొచ్చు. ఇప్పుడు ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను @ajaygiri3112 అనే ఇస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియో 530,564 లైక్ చేశారు. అంతేకాకుండా కొన్ని వందల మంది కామెంట్లు చేశారు. అయితే ఈ కామెంట్స్ చాలా మంది Har Har Mahadev ?? అని రాస్తూ వచ్చారు. అయితే సాధరణంగా ఇలాంటి అఘోరాలకు సంబంధించిన వీడియో చాలా అరుదుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









