)
Albino Great Shark Latest Viral Video: సముద్ర గర్భంలో దాగివున్న ప్రకృతి సృష్టించిన అద్భుతాలకు సంబంధించిన అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. ఈ దృశ్యాలు చూసిన యావత్ ప్రపంచ ఆశ్చర్యానికి గురవుతోంది. కేవలం ఆరు సెకండ్ల నిడివి గల వీడియో సముద్ర గర్భంలో దాగివున్న రాకాసి చేపల గురించి తెలిసేలా చేస్తోంది. ఇంతకీ ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఏముందో? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ షార్ట్ వీడియోలో ఓ అత్యంత అరుదైన 'ఆల్బినో గ్రేట్ వైట్ షార్క్' (Albino Great White Shark) కనిపిస్తుంది. ఇది ప్రమాదకరమైన చేపల్లో ఒకటి.. చూడడానికి ఎంతో గంభీరమైన శరీరాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద కళ్ళు ప్రత్యేకమైన ముఖ భాగాన్ని కలిగి ఉంటుంది. ఈ చేపను చూసిన వారికి అత్యంత ప్రమాదకరమైన రాకాసి చేప అని అనిపించడం ఖాయం. అలాంటి ఈ చేప సముద్రం నుంచి ఓ నది ఒడ్డుకి కొట్టుకొని వచ్చింది. అయితే ఈ చేపను చూసి ఎందుకు చాలామంది స్థానికులు అక్కడికి చేరుకొని దానితో ఫోటోలు దిగడం మీరు వీడియోలో క్లియర్ గా చూడొచ్చు..
ఇలాంటి షార్కులు చాలా ప్రమాదకరమని మన అందరికీ తెలుసు.. అయినప్పటికీ చాలామంది దానికి దగ్గరగా వెళ్లి ఫోటోలు దిగుతున్నారు. ఇక ఈ వీడియోలో ఉన్న అయితే ఓ వ్యక్తి ఆ అత్యంత ప్రమాదకరమైన షార్క్కును పట్టుకొని వీడియోకి ఫోజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనిని కొంతమంది ఆల్బినో' షార్క్ కూడా పిలుస్తారు. ఎందుకంటే దీని శరీరంలో వర్ణ ద్రవ్యం లేకపోవడం వల్ల ఇది ప్రత్యేకమైన రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చూడడానికి చాలా భయానకంగా ఉంటుంది.
ఇలాంటి షార్కులు కేవలం సముద్రపు లోపటి భాగంలో మాత్రమే జీవిస్తూ ఉంటాయట. ఇవి ఇతర చేపలను చంపుకొని ఆహారంగా మలుచుకుంటాయి. ఇలాంటి చేపలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియో చూసినవారు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ వైరల్ అవుతున్న వీడియో ఫేక్ దని.. ఇది AI ద్వారా రూపొందించిందని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోను క్లుప్తంగా పరిశీలిస్తే.. నీకు కూడా ఇది నిజమైన వీడియో కాదని తెలిసి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వినియోగం పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఫేక్ వీడియోలు చాలా వైరల్ అవుతూ వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook