Ramya kancharla come back with ramya moksha pickle video: అలేఖ్య పచ్చళ్ల సిస్టర్స్ వివాదం పెద్ద దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఒక రేంజ్ లో జరిగిన బిజినెస్ కాస్త.. వీళ్ల నోటీ దూలతో క్లోజ్ చేసుకొవాల్సి వచ్చింది. అంతే కాకుండా.. నోరు మంచిదైతే.. ఊరు మంచిదౌతుదంటారు పెద్దలు. అందుకే ఎంత ఎదిగిన కూడా మాటలు చక్కగా మాట్లాడితేనేఅందరు గౌరవిస్తారు. అలేఖ్క సిస్టర్స్ లు ఇటీవల ఒక కస్టమర్ తో నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడారు.
పచ్చళ్లు కొనలేని వాడు పెళ్లాం, లవర్ ను ఏంచూసుకుంటావ్ అంటూ మాట్లాడింది. మరో లేడీ కస్టమర్ ను నాలుగిళ్లలో పాచి పనులు చేసుకొవాలని చెప్పింది. ఈబూతుల ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మొత్తంగా అలేఖ్య ఘటనతో సోషల్ మీడియాలో వీళ్లను ట్రోలర్స్ ఒక రేంజ్ లో ఆడుకున్నారు. ఇదిలా ఉండగా.. రమ్య కంచర్ల తాజాగా.. మరో వీడియోను రిలీజ్ చేశారు.
పద్ధతి, పలకరింపు అన్నీ మార్చుకొని
"రమ్య మోక్ష పికిల్స్" పేరు మీద
మళ్ళీ సూపర్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉంది
మీ ఫ్రెండ్స్ తప్పు చేస్తే రెండో అవకాశం ఇస్తారుగా
అలాగే పాపకి కూడా ఇచ్చి చూడండి ?ఇట్లు - రమ్య రైడర్స్ అభిమాన సంఘం
"మార్పు చెందినామె మహనీయురాలు" ? pic.twitter.com/G8wwNF2AHq
— పెద్ది రెడ్డి ? (@MrHyperReddy) April 18, 2025
ఇప్పటి వరకు జరిగిన దానికి మరోసారి సారి చెబుతూ.. తాము మరో కొత్త పేరుతో రమ్య మోక్ష పిక్కిల్స్ పేరుతో మరోసారి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా గతంలో తాను సినిమాల కోసం ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. కానీ అప్పుడు తాను పచ్చళ్ల బిజినెస్ చేస్తే.. బాగుండదని.. అలేఖ్య పిక్కిల్స్ పేరుపెట్టినట్లు చెప్పారు.
ఇక మీదట గత అనుభవాల్నిగుర్తు పెట్టుకుని పచ్చళ్ల రేట్లను జనాలకు తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పింది. అంతే కాకుండా.. ఒక వ్యక్తిని కూడా ఆర్డర్ లు తీసుకునేందుకు రిక్రూట్ చేస్తామని కూడా చెప్పుకొచ్చింది.
Read more: Urvashi Rautela: ఏం మాట్లాడుతున్నావ్..?.. ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలపై ఇచ్చిపడేసిన బద్రినాథ్ అర్చకులు..!
తనకు 23 ఏళ్లని..ఈ చిన్న వయసులోనే చూడనికి, పడనివి అన్ని ఎదుర్కొన్నామని చెప్పింది. ఈ కొత్త బిజినెస్ లో మా అక్కను చేర్చుకొవట్లేదనికూడా చెప్పింది. అదే విధంగా చాలా మంది తమను మళ్లీ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్తున్నారని.. అందరి సూచనలతో కొత్త పేరుతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని, దయచేసిన తమను ఆదరించాలని రమ్య కంచర్ల వీడియో రిలీజ్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









