Ramya kancharla mass dance video goes viral: అలేఖ్య సిస్టర్స్ పిక్కిల్స్ బూతు మాటల వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాను కుదుపేస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వీరి బూతుల వీడియోలు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వీరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అందంగా ఉంటే సరిపొదని.. సంస్కారం ఉండాలని కూడా చివాట్లు పెడుతున్నారు. అమ్మాయిలైన ఉండి.. ఆ బూతులేంటని కూడా నెటిజన్ లు మండిపడుతున్నారు.
ఇటీవల అలేఖ్య పిక్కిల్స్ కోసం ఒక కస్టమర్ వారి వాట్సాప్ కు మెస్సెజ్ చేశాడు. దీంతో అలేఖ్య పిక్కిల్స్ వాళ్లు వెంటనే పిక్కిల్స్ రేట్లు పెట్టారు. అది చూసిన అతను వామ్మో.. ఇంత కాస్లీనా..అని అడిగాడు.దీంతో అలేఖ్య సిస్టర్స్ రెచ్చిపోయి.. అసలు.. నువ్వు వీటికే ఇంత ధరలు ఉంటే.. పెళ్లాన్ని, లవర్ ను ఏంచూసుకుంటావ్ అని తీసిపడేసింది.
Reason for #alekhyachittipickles high prices ?? pic.twitter.com/X4sF0jaKlt
— Urstruly Vinodh (@UrsVinodhDHFM) April 4, 2025
నువ్వు ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టాలని.. అతని తల్లిని, చెల్లిని కూడా బూతులు తిట్టింది. ఆ ఆడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై ప్రస్తుతం వివాదాం పీక్స్ కు వెళ్లింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అలేఖ్య పిక్కిల్స్ సిస్టర్స్.. బూతులపై వివాదంతో సోషల్ మీడియాల కాకరేపుతుంది. ఇంకా దీనిపై ప్రస్తుతం అలేఖ్య సిస్టర్స్ దిగొచ్చిట్లు తెలుస్తొంది.
తమకు చాలా మంది వేధిస్తున్నారని, అందుకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని కూడా అలేఖ్య రమ్య తన గొడును చెప్పుకొచ్చారు. తాము ఈ పిక్కిల్స్ బిజినెస్ కోసం ఎంతో కష్టపడ్డామని.. ఇప్పుడు ఈ విధంగా జరిగినందుకు చాలా బాధాగా ఉందని కూడా రమ్య బాధపడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా..ప్రస్తుతం మళ్లీ నెట్టింట రమ్య కంచర్ల చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోలో.. రమ్య కంచర్ల మాస్ స్టెప్పులు వేస్తు దుమ్మురేపుతుంది. అంతే కాకుండా.. అలేఖ్య సిస్టర్స్ ఘటన మాత్రం కాంట్రవర్సీగా మారింది. ఈ క్రమంలో నెటిజన్ లు కొంత మంది ఈ బూతులు తిట్టిన సిస్టర్స్ లలొ ఎవరైన .. ఒకరు ఆ తిట్లు తిట్టిన వ్యక్తిని పెళ్లి చేసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా అలేఖ్య పిక్కిల్స్ ఘటన మాత్రం సోషల్ మీడియాలో రచ్చగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









