Alekhya chitti pickles sisters controversy video: అలేఖ్య, చిట్టి, రమ్య ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వీరు ఏపీలోని రాజమండ్రిలో పచ్చళ్లు అమ్ముకుంటూ బిజినెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరు వెజ్ తోపాటు, నాన్ వెజ్ లోని అన్నిరకాలైన కారం పొడులు, పచ్చళ్లను తయారు చేసి అమ్ముతుంటారు. వీరి బిజినెస్ ప్రమోషన్ లో కోసం వీరి ఇన్ స్టా, సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు, రీల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో వీరికి మార్కెట్ లో మంచి పబ్లిసిటీ వచ్చింది.
అయితే.. వీరు కొన్ని ఫోన్ నెంబర్ లను పెట్టుకున్నారు. దానిలో వాట్సాప్ గ్రూప్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఒక కస్టమర్ రొయ్యాల ఆవకాయ, ఫిష్ ఆవకాయల రేట్లను అడిగాడు. వీళ్లు వాళ్లు అమ్ముతున్న ధరల వివరాలను అతనికి సెండ్ చేశారు. అది చూసి ఖంగుతిన్న అతగాడు... ధరలేంటీ.. ఇంతగా ఉన్నాయని ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన అలేఖ్య పిక్కిల్స్ సిస్టర్స్ లలో ఒకరు.. దీన్ని కాస్లీ రేటు అంటే.. మిగత నువ్వు లైఫ్ లో ఏంసాధిస్తావని మండిపడింది.
Okkokati bayataki vastunnayi ?
Now the victim is a lady customer pic.twitter.com/0GTHrrPdUp— Satya ™️ (@MSD_Prabhasatya) April 3, 2025
నీ భార్యకు, లవర్ కు బంగారం ఏంకొనిపెడతావ్..నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు అంటూ చాలా రూడ్ గా మాట్లాడింది. అది కాస్త వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు వీళ్లపై మండిపడుతున్నారు. మొత్తంగా రెండు రోజుల నుంచి వీరి కాంట్రవర్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
Read more: Secunderabad: రన్నింగ్ ట్రైన్‌లో మరో ఘోరం.. అరగంటపాటు మైనర్ బాలికపై వాష్ రూమ్‌లో అఘాయిత్యం..!
ఇక మరోవైపు తాజాగా.. ఈ ఈ సిస్టర్స్ లో ఒకరు మరో కస్టమర్ తో కూడా రేటు విషయంలో ఛెండాలంగా మాట్లాడినట్లు ఒక వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఊరగాయల ధరల్ని ఇంతనా.. అంటున్నావ్.. అసలు నువ్వు.. ప్రతి ఇంటికి వెళ్లి పాచీ పని చేసి బతుకు అంటూ కూడా అలేఖ్య సిస్టర్స్ లలో ఒకరు బూతులు మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ అవుతుంది. వీరిపై చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వీరి దగ్గర అస్సలు పిక్కిల్స్ కొనొద్దని కూడా సోషల్ మీడియాలో వీళ్ల బూతుల వీడియోలు వైరల్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









