Alekhya chitti in icu video: అలేఖ్య పిక్కిల్స్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తుంది. అలేఖ్య సిస్టర్స్ బూతులు నెట్టింట ఒక రేంజ్ లో వైరల్గా మారాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అలేఖ్య చిట్టి సిస్టర్స్ ను నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. అసలు.. అందమైన ముఖాలు పెట్టుకుని.. ఆబూతులు ఏంట్రా బాబోయ్ అంటూ నెట్టింట తెగ మండిపడుతున్నారు. అంతేకాకుండా.. ఆ బూతులు తిట్టిన వ్యక్తిని మీలో ఒకరు పెళ్లి చేసుకొవాలని కూడా నెటిజన్లు కొత్తగా డిమాండ్ కూడా చేశారు.
ఈ క్రమంలో ప్రస్తుతం వీరి పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ అయినట్లు క్లియగా అర్థమౌతుంది. ఈ క్రమంలో అలేఖ్య చిట్టిని నెట్టింట విపరీతంగా ట్రోల్స్ చేయడం వల్ల తమ ఫ్యామిలీ విపరీతంగా ఒత్తిడికి గురైందని సౌమ్య తెలిపింది. ఈ క్రమంలో తన చెల్లెలు అలేఖ్య చిట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చిందని దీని వల్ల ఆమె ఆరోగ్యం చాలా దెబ్బతినడం వల్ల వైద్యులు ఐసీయూలో ఉంచి మరీ ట్రీట్మెంట్ అందిస్తున్నారని సౌమ్య తన చెల్లెలు తీసుకుంటున్న వీడియోను సైతం రిలీజ్ చేసింది.
"ALEKYA CHITTI HOSPITALISED AYYINDI ANTA"
Ika Vadileyandi ra papam iga??
Simple suggestion for Alekya, assalu meeru social media ki dooram unte antha set Avutundi? pic.twitter.com/mHf95GySZO— MawaNuvvuThopu (@MawaNuvvuThopu) April 7, 2025
మూడు నెలల క్రితమే తమ నాన్న చనిపోయారని.. మరో మరణం తమ ఇంట్లో జరిగితే భరించే శక్తి తమకు లేదని కూడా సౌమ్య ఎమోషనల్ అయ్యింది. మొత్తంగా సారీ చెబుతున్నామని కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పటికైన తమ మీద దయతో వదిలిపెట్టాలని సౌమ్య నెటిజన్లకు కన్నీళ్లతో రిక్వెస్ట్ చేస్తు మరో వీడియోను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో అలేఖ్య చిట్టి గతంలో బూతు మాటలతో కస్టమర్లకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే.
పిక్కిల్స్ రేట్లు ఎందుకింత కాస్లీగా ఉన్నాయంటే.. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని.. పచ్చళ్లను కొనలేని వాడికి పెళ్లాంను, లవర్ ను ఏంచూసుకుంటావ్.. అని బండ బూతులు తిట్టింది.మరో లేడీ కస్టమర్ లకు నాలుగిళ్లలో పాచీపనులు చేసుకొమ్మంటూ కూడా అలేఖ్య చిట్టి నోటికొచ్చినట్లు మాట్లాడిన వీడియోలు వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు వీళ్లను ఒక రేంజ్ లో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









