Python Snake Vs Elephant Video: పాపం.. ఏనుగును చుట్టేసిన అనకొండ.. వీడియో భయపడడం పక్కా..

Python Snake Vs Elephant Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో అనకొండకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 11, 2025, 04:34 PM IST
Python Snake Vs Elephant Video: పాపం.. ఏనుగును చుట్టేసిన అనకొండ.. వీడియో భయపడడం పక్కా..

Python Snake Vs Elephant Viral Video Watch Here: అతి భయంకరమైన పాముల జాతులకు సంబంధించిన వాటిల్లో అనకొండ జాతి పాములు ఒకటి.. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికాలోకి వివిధ చిత్తడి నెలల్లో జీవిస్తూ ఉంటాయి. వీటి శరీరం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతంగా, అలాగే అధిక బరువుతో ఉంటాయి. అయితే వీటిల్లో ఆడ పాములు, మగ పాముల కంటే చాలా ఎక్కువ పెద్దవిగా ఉంటాయని సమాచారం. దీంతో పాటు ఇవి ఆహారంగా శక్తితో కూడిన పెద్ద జంతువులను కూడా చంపి తినగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సాధరణంగా ఇవి 200 నుంచి 550 కేజీల బరువును కలిగి ఉంటుంది. 

Add Zee News as a Preferred Source

సాధారణంగా ఆడ అనకొండలు దాదాపు 25 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. దీంతో పాటు ఇవి ఎక్కువగా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో లభిస్తాయి. అలాగే చిన్న పాములు 10 అడుగుల పొడవును కలిగి ఉంటాయని సమాచారం. వీటి తల భారీ శరీరానికి కంటే చాలా చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా కళ్లు, నాసికా రంధ్రాలు తల పైభాగంలో ఉంటాయి. ఇది నీటిలో మునిగి ఉన్నప్పుడు కూడా చూడటానికి, శ్వాస తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ భారీ అనకొండలు పాములు అమెజాన్‌తో పాటు ఒరినోకో నదీ పరీవాహక ప్రాంతాలలో ఇప్పటికీ నివసిస్తూనే ఉన్నాయి.

అనకొండలు ఎక్కువగా మాంసంతో కూడిన ఆహారాలు తినేందుకే ఇష్టపడతాయి. అవి ప్రధానంగా  మొసళ్ళు, తాబేళ్లు, పక్షులు, కొన్నిసార్లు జింకలు, పెద్ద పెద్ద ఎనుగులను సైతం తినగలుగుతాయి. అనకొండలు సాధారణంగా ఒంటరిగా ఉండే జీవులుగా చెప్పుకుంటారు. ఇవి భూమిపై కంటే నీటిలో చాలా చురుకుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో వేటాడేందుకు ఇష్టపడతాయని సమాచారం. కొన్ని అనకొండపాములు చాలా డేంజర్‌.. ఇవి ఎనుగులను సైతం సులభంగా వెంటాడి.. వేటాడగలవు..సాధారణంగా వీటికి సంబంధించిన చాలా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో కూడా విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

ఈ వైరల్‌ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ పెద్ద ఏనుగును అనకొండ చుట్టుకుని ఉండడం గమనించవచ్చు. అంతేకాకుండా ఆ ఏనుగు పామును విడిపించుకునేందుకు అటు ఇటు తిరగడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను Blondi Foks అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్ చేశారు. దీనిని ఇప్పటి వరకు 70 వేల మందికిపైగా వీక్షించారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News