)
Lion Vs Anaconda Video Watch: సింహాన్ని అడవికి రాజుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇది అత్యంత శక్తివంతమైన జంతువుల్లో ఒకటి. రోజు వారి ఆహారంలో భాగంగా సింహం వివిధ రకాల జంతువులను వేటాడుతుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన కండరాలతో పాటు దవడ భాగాలను కలిగి ఉంటుంది.. కాబట్టి ఇతర జంతువులు వీటిపై దాడి చేసేందుకు అంతగా ఆసక్తి చూపవు. అలాంటి శక్తివంతమైన సింహానికి ఓ అనకొండ షాక్ ఇచ్చింది. ఏకంగా ఆ పాము సింహం పై దాడి చేయకనే చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యంత ప్రమాదకరమైన సింహం నీటిని తాగేందుకు ఓ సరస్సు దగ్గరికి చేరుకొంది. ఈ ఒడ్డుపై ఉండి నీటిని తాగేందుకు ప్రయత్నించింది. ఇంతలోనే ఆ నీటిలో ఉన్న అనకొండ పాము ఆ సింహంపై దాడి చేసి దాని చుట్టూ చుట్టేసింది. అనకొండ అత్యంత శక్తివంతమైన కండరాలను కలిగి ఉంటుంది. దాని కండరాలతో సింహాన్ని చుట్టేయడంతో.. అది ఎటు కదలలేని పరిస్థితుల్లో అక్కడే కింద పడిపోయి ఉంది.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, అనకొండ నుంచి సింహాన్ని విడిపించేందుకు అక్కడే ఉన్న ఓ సింహం పిల్ల కూడా అక్కడికి వచ్చింది.
సింహం పిల్ల అనకొండ పామును తన నోటితో కొరకడం మీరు గమనించవచ్చు. ఆ చిన్న పిల్ల పామును ఎంత కొరికినప్పటికీ వదిలిపెట్టకుండా తల్లి సింహం చుట్టూ చుట్టుకొని ఉండిపోయింది. సింహం పిల్ల చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది.. ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన అనకొండ పాములు ఎలాంటి క్రూరము మృగాలనైన పట్టుకుని వేటాడగలవని ఈ వీడియో చూస్తే అర్థమయిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి