Anaconda Snake Rescue Video: ప్రపంచంలోని నివసించే అతిపెద్ద పాముల్లో అనకొండాలు ఒకటి.. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి. ఇవి ఎంతో శక్తివంతమైన శరీరంతో పాటు బలమైన కండరాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి తమ ఆహారాన్ని సులభంగా వెంటాడుతూ ఉంటాయి. ఇవి తమ ఆకలిని తీర్చుకోవడానికి భారీ జంతువులను సైతంను అమాంతం మింగేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో పాటు ఈ పాములు చాలా అరుదుగా వేటాడుతూ ఉంటాయి.
అనకొండాలు ప్రధానంగా రెండు రకాల వేట పద్ధతులను ఉపయోగిస్తాయి. ఇందులో ప్రధానమైనది మాటు వేయడం (Ambush Predation).. అనకొండాలు తమ కావాల్సిన ఆహారాలను వేటాడేందుకు తరచుగా నీటిలో లేదా ఒడ్డుపై కాపుగాస్తూ ఉంటాయి. అలాగే నీటిలో పెరిగే వివిధ రకాల చెట్లు వాటి ఆకుపచ్చ రంగులతో బాగా కలిసిపోతాయి. ఇలా కాపుగాసే వాటిని గుర్తించడం చాలా కష్టం.. ఏదైనా జంతువు నీరు త్రాగడానికి లేదా సమీపానికి వచ్చినప్పుడు, అనకొండ మెరుపు వేగంతో దాడి చేస్తుంది. వాటి ఆహారంగా మలుకుంటూ ఉంటాయి.
ఈ పాములు అనుసరించే రెండవ పద్దతి..చుట్టి చంపడం (Constriction).. అనకొండ పాములు చాలా బలమైన కండరాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఏ జంతువునైనా చుట్టి చంపే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ పాము ఒక్కసారి దేనినైనా చుట్టుకుంటే రక్త ప్రసరణ క్షణాల్లో నిలిచిపోతుంది. అంతేకాకుండా ఊపిరాడకుండా చేస్తుంది. ఈ అనకొండాలోని కొన్ని పాములు చుట్టుకుంటే ఎముకలు కూడా సులభంగా విరిగిపోతాయి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటాం.. కొన్ని పాములు జంతువులను బిగుతుగా చుట్టేసి, అమాంతంగా మింగేస్తూ ఉంటాయి. తాజాగా మరో వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఈ వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి పెద్ద అనకొండ పాము సంచారం చేసి, కుక్కపై దాడి చేసి.. దాని చుట్టూ చుట్టుకుని తినడం కూడా గమనించవచ్చు. అయితే అక్కడే ఉన్న కొంతమంది దీనిని గమనించి.. స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించగా.. వారు అక్కడి చేరుకుని పామును పట్టుకుని సురక్షితమైన ప్రదేశానికి తరలించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను @వైభవపాటిల్10 అనే యూట్యుబ్ చానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు 2.2 మిలియన్ సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









